
M9.news నిన్న ప్రచురించిన ‘చిరంజీవి Vs అనిల్ సుంకర.. భోళా శంకర్ రెమ్యూనరేషన్ రచ్చ!’ అనే ఆర్టికల్ పెద్ద చర్చ కు దారి తీసింది. అయితే చాలా మంది సోషల్ మీడియాలో ఇటువంటి కాంబినేషన్ ని సెట్ చేసినందుకు అనిల్ సుంకర కు ఇది జరగాల్సిందే అని అంటున్నారు.
అయితే ఇది కూడా అనిల్ ప్రమేయం లేకుండానే జరిగిపోయిందని సమాచారం.
వివరాల్లోకి వెళ్తే… కోవిడ్ టైం లో హైదరాబాద్ లో ఎమ్మెల్యే కాలనీ లో ఒక మంచి ప్రాపర్టీ అమ్మకానికి వచ్చింది. చిరంజీవి తన చిన్న కూతురికి కొనిపెట్టాలని అనుకున్నారు. అందుకు గాను అనిల్ దగ్గర ఒక 10 కోట్లు, మైత్రి వాళ్ళ దగ్గర ఒక 10 కోట్లు తీసుకున్నారు.
మైత్రి దగ్గర తీసుకున్న 10 కోట్లు వాల్తేరు వీరయ్య లో సెటిల్ చేశారు… ఇక అనిల్ విషయంలోనే తేడా వచ్చింది.
వేదాళం రీమేక్ మెహర్ రమేష్ తో చెయ్యాలి అనుకున్నారు. అయితే తన రెమ్యూనరేషన్ లో కొంత భాగం కి గాను తాను కూడా సినిమాలో పార్టనర్ గా ఉంటా అని చిరంజీవి ఆఫర్ చేశారు.
అలాగే సీనియర్ నిర్మాత కేఎస్ రామారావు తో తనకు పాత కమిట్ మెంట్ ఉంది కాబట్టి ఆయన్ను కూడా చేర్చుకుందాం అనుకున్నారు.
చిరంజీవి, కేఎస్ రామారావు పార్టనర్స్ గా ఉంటే రిస్క్ తక్కువ… నాన్-థియేట్రికల్ ఉంటుంది అలాగే బిజినెస్ కూడా ఎంతో కొంత ఉండకుండా ఉండదు కాబట్టి అనిల్ సరే అని దిగారు.
అయితే సినిమా సరిగ్గా రావట్లేదని మనసు మార్చుకున్నారో లేక… ఇప్పటి దుస్థితి ముందే ఊహించారో గానీ చిరంజీవి ఒకరోజు అనిల్ ని పిలిచి నాకు పార్టనర్ షిప్ వద్దు… 65 కోట్లు రెమ్యూనరేషన్ సెట్ చెయ్యండి అని చావు కబురు చల్లగా చెప్పారట.
సినిమా సెట్స్ మీద ఉంది… ఎదురుగా ఉంది పెద్ద హీరో…. ఇండస్ట్రీలో పద్దతి ఇలానే ఉంటుంది అని అనిల్ పంటి బిగువున బాధను అదిమిపట్టుకుని ముందుకు కదిలారు.
ఇక కేఎస్ రామారావు పార్టనర్ గా ఉంటే ఆయన అప్పుల వాళ్లంతా సినిమా మీద పడే అవకాశం ఉండటంతో ఆయనను కూడా తప్పించారని సమాచారం. ఆ రకంగా అనిల్ సుంకర మునుగుతున్న భోళా పడవలో ఒక్కరే అయిపోయారు.
65 కోట్లలో చాలా వరకు చిరంజీవి రిలీజ్ కి ముందే వసూలు చేసేసుకున్నారు కూడా… నాకు క్లియర్ చేసి రిలీజ్ చేసుకోండి అనడం తో అనిల్ ఆస్తులు తాకట్టు పెట్టి డబ్బు తెచ్చారని ఇండస్ట్రీలో టాక్.
సినిమా దారుణంగా పోయింది…. అయినా కానీ చిరంజీవి ఇంకో చిన్న పోస్ట్ – డేటెడ్ చెక్ మిగిలి ఉందని సమాచారం. ఇక ఆ పంచాయతీ ఎటు వెళ్తుందో చూడాలి.
Elon Musk has become the first person in history to reach a trillion-dollar net worth,…
The Ramayana teaser has given audiences an idea of the scale Namit Malhotra is planning…