
తెలుగులో ‘బిచ్చగాడు’గా విడుదలైన ఈ ‘పిచ్చైక్కారన్’ తర్వాత సాట్నాకు అవకాశాలు క్యూ కట్టాయి. అయితే ఇదే సమయంలో ఈ సినిమాను పంపిణీ చేసిన డిస్ట్రిబ్యూటర్ కార్తీతో ప్రేమలో పడిన ఈ ముద్దుగుమ్మ, ఒక నెల క్రిందట రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఎలాంటి సమాచారం లేకపోవడంతో మీడియా వర్గాలకు చాలా ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వివాహం కావడంతో ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చి అడ్వాన్సు పుచ్చుకున్న ‘తిట్టం పోట్టు తిరుడర కూట్టం’కు సంబంధించిన మొత్తాన్ని తిరిగి ఇచ్చేసిందట.
అలాగే అమీర్ దర్శకత్వంలో “సంగదేవన్” సినిమాలో నటించడానికి కూడా అంగీకారం తెలుపగా, ఈ సినిమా స్టేటస్ ఏంటన్నది ప్రశ్నార్ధకంగా మారింది. అర్ధాంతరంగా చేసుకున్న ఈ వివాహం పట్ల సాట్నా పేరెంట్స్ ఆగ్రహంగా ఉన్నారని తెలుస్తోంది. తమ కుమార్తెను కార్తీ మాయలో పడేసాడని, అతని నుండి సాట్నాను విడిపించి, తమకు తమ కుమార్తెను అప్పగించాలని సాట్నా తల్లి నడిఘర్ సంఘాన్ని ఆశ్రయించినట్లుగా తెలుస్తోంది.
The box office results have become very unpredictable. Amid this, the situation of every big…
Allu Arjun’s Forbes India feature was meant to highlight his growing pan-India popularity. Instead, a…