
తాజాగా జరిగిన తెలంగాణ పంచాయితీ ఎన్నికలలో అధికార కాంగ్రెస్ తన హవ కొనసాగించినప్పటికీ ప్రతిపక్ష బిఆర్ఎస్ కూడా ఊహించిన స్థాయి కన్నా మంచి స్థానాలనే దక్కించుకోగలిగింది. వార్ వన్ సైడ్ అనే ధోరణిలో కాకుండా కాంగ్రెస్ పార్టీకి కొన్ని చోట్ల బిఆర్ఎస్ గట్టి ఫైట్ ఇచ్చిందనే చెప్పాలి.
అయితే బిఆర్ఎస్ ఈ విజయాల వెనుక బీజేపీ తో ఉన్న అక్రమ పొత్తులే కారణమంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీ – బిఆర్ఎస్ ల మధ్య తెరచాటుగా రాజకీయ పొత్తు కుదిరింది అంటూ ఆరోపిస్తున్నారు.
చాల ప్రాంతాలలో బిఆర్ఎస్ గెలుపు కోసం బీజేపీ రాజకీయ త్యాగానికి సిద్దమయ్యిందని అయినా అవేమి కాంగ్రెస్ గెలుపుని అడ్డుకోలేకపోయాయంటూ రేవంత్ ఈ ఇరు పార్టీల పై కీలక వ్యాఖ్యలు చేసారు.
బీజేపీ, బిఆర్ఎస్ ఉమ్మడి శత్రువు కాంగ్రెస్ యే అని, అందుకే ఈ రెండు పార్టీల నేతలు ఒకరి పై మరొకరు విమర్శలు చేసుకోకుండా, అనధికార పొత్తులు పెట్టుకుంటూ తెరచాటు రాజకీయాలు నడుపుతున్నారు అనేది కాంగ్రెస్ వాదన.
అయితే కాంగ్రెస్ చేస్తున్న ఈ ఆరోపణలలో అసలు వాస్తవం ఉందా అంటే అందుకు బీజేపీ చర్యలు, ఆ పార్టీ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు అనుమానాలను కలిగిస్తున్నాయి.
అసలు బిఆర్ఎస్ పై దూకుడుగా ముందుకెళ్లి, తెలంగాణలో బీజేపీ ని రాజకీయంగా ముందుకు తీసుకొచ్చిన బండి సంజయ్ ని కాదని బీజేపీ మరొకరికి రాష్ట్ర పార్టీ పగ్గాలను అప్పగించడం దగ్గర మొదలైన ఈ అనుమానాలు ఇప్పటికి అలానే కొనసాగుతూనే వస్తున్నాయి.
కొన్ని రోజులు హడావుడి రాజకీయాలు నడిపే బీజేపీ అప్పటికప్పుడే అకస్మాత్తుగా రాష్ట్ర రాజకీయాల నుండి కనుమరుగయిపోతుంది, ఇక అందుకు తగ్గట్టే టి.బీజేపీ నేతలంతా సైలెంట్ మోడ్ లోకి వెళ్ళిపోతారు.
అలాగే బిఆర్ఎస్ అంటే మండిపడే ఈటెల రాజేంద్ర ప్రసాద్ వంటి సీనియర్ నాయకులు బీజేపీ లో ఉన్నప్పటికీ వారిని పార్టీ ఎదుగుదలకు వినియోగించుకోకపోవడం బీజేపీ అసమర్ధత అనుకోవాలా.? లేక బిఆర్ఎస్ తో ఉన్న మైత్రి బంధమనుకోవాలా.?
ఇక కవిత అరెస్టు విషయంలోనూ బిఆర్ఎస్ బీజేపీ పై ఎటువంటి రాజకీయ దాడి జరపలేదు. కాళేశ్వరం లో కేసీఆర్, హరీష్ ల అవినీతి అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం దాని పై విచారణకు సిబిఐ కావాలంటు బాల్ ని బీజేపీ కోర్ట్ లో వేసినా బీజేపీ ఇప్పటికి అందుకు తగ్గ చర్యలు తీసుకోలేకపోయింది.
ఇలా అనేక అంశాలలో బీజేపీ నిశ్శబ్దం, బిఆర్ఎస్ చూసిచూడని విధానం బీజేపీ – బిఆర్ఎస్ ల మధ్య ఎదో ఉంది అనేలా తెలంగాణ రాజకీయాలలో ఎన్నో అనుమానాలను రేకెత్తిస్తున్నాయి.
Payal Radhakrishna turns up the glamour in a shimmering bronze halter dress that feels playful,…
Bhuvneshwar Kumar is finally back in the Indian team after four years. At 36, the…