
తెలంగాణ బీజేపీ అధ్యక్ష ఎంపికలో బీజేపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం బీజేపీ, బిఆర్ఎస్ బంధానికి తొలి అడుగు అంటూ కాంగ్రెస్ నేత, టి పీసీసీ మీడియా ఛైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి తన సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేసారు.
తెలంగాణలో బీజేపీ బలోపేతానికి కాకుండా బిఆర్ఎస్ తో స్నేహ బంధానికి ఈ అధ్యక్ష ఎంపిక నిదర్శనం అంటూ వ్యాఖ్యానిస్తున్న కాంగ్రెస్ కు ఒక రకంగా బీజేపీ క్యాడర్ కూడా మద్దతు తెలిపే పరిస్థితి ఏర్పడింది.
ఇటీవల బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆరోపిసించిన బీజేపీ, బిఆర్ఎస్ విలీన బంధానికి ఇప్పుడు బీజేపీ అధిష్టానం తీసుకున్న అధ్యక్ష ఎంపిక ఒక శాంపిల్ మాదిరే అన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తుంది.
బిఆర్ఎస్ ఓటమి నాటి నుంచి నేటి వరకు పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ అజ్ఞాత వాసాన్ని వీడి బయటకు రావడం లేదు, ఇక కూతురు కవిత ఢిల్లీ లిక్కర్ స్కాం లో, కుమారుడు కేటీఆర్ ఫోన్ టాపింగ్, ఈ ఫార్ములా కేసులో, ఇక కాళేశ్వరం లో కేసీఆర్, హరీష్ ఇలా కేసీఆర్ కుటుంబం మొత్తం కేసుల వలయంలో చిక్కుకుపోయింది.
దీనితో రాష్ట్రంలో రెండవ స్థానంలో ఉన్న బిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదగడానికి పూర్తి అవకాశం కనిపిస్తుంది. గతంలో బండి సంజయ్ అధ్యక్ష హయాంలో బీజేపీ బిఆర్ఎస్ కు ధీటైన జవాబు ఇస్తూ అటు కాంగ్రెస్ కు గట్టి పోటీగా ఎదిగింది. అటువంటి సమయంలో బీజేపీ అధిష్టానం అధ్యక్ష మార్పుతో పార్టీ ఎదుగుదలకు అడ్డుకట్ట వేసింది.
ఇక ఇప్పుడు బిఆర్ఎస్ ఓటమి, కేసులతో నిస్సహాయ స్థితిలో ఉంటూ పార్టీ ఉనికి కోసం పోరాడుతుంది. ఇటువంటి సమయంలో బీజేపీ దూకుడుగా ముందుకెళ్లగలిగితే కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా, బిఆర్ఎస్ స్థానాన్ని అందిపుచ్చుకునే అవకాశం ఉంది. ఇటువంటి మంచి అవకాశాన్ని బీజేపీ కావాలనే కాలతన్నుకుంటుందా అన్న ప్రశ్న ఎదురవుతుందా.?
తెలంగాణలో రాబోయే సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ, బిఆర్ఎస్ పార్టీలు పొత్తులో ఒక్కటవబోతున్నాయా.? లేక కవిత ఆరోపిస్తున్నట్టుగా బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం కానుందా.? అందుకే బీజేపీ అధిష్టానం రాజకీయంగా ఎటువంటి ప్రచారం లేని రామ్ చందర్ రావు కు అధ్యక్ష పదవి కట్టబెట్టిందా.? అనే ఎన్నో ప్రశ్నలు తెలంగాణ బీజేపీ ముంగిట వాలాయి.
బీజేపీ, బిఆర్ఎస్ తో పొత్తులోకి వెళితే తెలంగాణ బీజేపీ లో ఈ పొత్తును వ్యతిరేకించే వర్గం అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటారా.? ఈటెల, బండి వంటి సీనియర్ నాయకులు, ప్రజాదరణ కలిగిన నేతలు బిఆర్ఎస్ పొత్తుకు పచ్చ జెండా ఊపుతారా.? ఇటు క్షేత్ర స్థాయిలో బిఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి, అక్రమాల మీద పోరాడుతున్న బీజేపీ భవిష్యత్ లో దానికి అండగా ఉండబోతుందా.?
కేసీఆర్ కుటుంబ సభ్యుల మీద నమోదవుతున్న కేసుల విషయంలో విచారణ జాప్యం, చర్యలలో అలసత్వానికి కారణం బీజేపీ, బిఆర్ఎస్ తెరచాటు రాజకీయమేనా.? ఇప్పటికే ఫోన్ టాపింగ్ విషయంలో బీజేపీ ముఖ్య నేతలు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితులలో కాంగ్రెస్ ఆరోపిస్తునట్టు బీజేపీ = బిఆర్ఎస్ అవుతుందా.?
Fauzi is now reportedly targeting a March 18, 2027 release. The film was originally scheduled…
The bodycam footage of an arrest has gone viral on Instagram. The footage shows police…