
తెలంగాణ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడి వివాదం ఇప్పుడు ఆయనకు పెద్ద రాజకీయ తలపోటుగా మారుతుంది. బండి భగీరథ్ ఒక 17 ఏళ్ళ మైనర్ బాలిక పై వేధింపులకు దిగాడు అనే ఆరోపణలతో బాధిత తల్లి భగీరథ్ పై కేసు నమోదు చేసింది.
బాధిత మహిళ మైనర్ కావడంతో బండి భగీరథ్ పై పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసారు. ఇక తాజాగా బాధిత మహిళ ఇచ్చిన స్టేటమెంట్ల ఆధారంగా మరిన్ని సెక్షన్ల కింద భగీరథ్ పై కేసులు నమోదవుతున్నాయి.
ఈ నేపథ్యంలో కుమారుడి పై లైంగిక ఆరోపణలు రావడం, కేసులు నమోదు కావడం, అరెస్టులు జరగడంతో బండి సంజయ్ ని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చెయ్యాలంటూ, లేదా బండి సంజయ్ తన మంత్రి పదవికి రాజీనామా చెయ్యాలంటూ బిఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది.
అయితే బిఆర్ఎస్ తెరమీదకు తెచ్చిన ఈ డిమాండ్ల పట్ల టి. బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు ఘాటుగా స్పందించారు. గతంలో తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్, తన కుమార్తె కవిత కేసు విషయంలో ఇలానే స్పందిచారా.? అప్పుడు కవిత బిఆర్ఎస్ ఎమ్మెల్యే గా ఉన్నారు, అలాగే కవిత అదే పార్టీ తరుపున మాజీ ఎంపీ గా కూడా బాధ్యతలు నిర్వహించారు.
అటువంటి కవిత పై ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు ఆరోపణలు ఎదురయ్యాయి, ఆ కేసులో కవిత అరెస్టయ్యి దాదాపు ఆరు మాసాలు తీహార్ జైల్లో ఉన్నారు. ఆ సమయంలో పార్టీ అధినేతగా, రాష్ట్ర ముఖ్యంమత్రిగా కేసీఆర్ కానీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా, మంత్రిగా ఉన్న కేటీఆర్ కానీ కవిత కేసులకు బాధ్యత వహిస్తూ తమ పదవులకు రాజీనామా చేసారా.? అంటూ రామచంద్ర రావు బిఆర్ఎస్ కు తన లాజిక్ తో కౌంటర్ ఇచ్చారు.
అలాగే నాడు పార్టీ ఎమ్మెల్సీ పదవిలో ఉన్న కవితను పార్టీ అధినేత హోదాలో ఉన్న కేసీఆర్ పార్టీ నుంచి బర్తరఫ్ చేసారా.? కనీసం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్, కవిత విషయంలో గౌంతెత్తారా.? మరి నాడు కేసీఆర్, కేటీఆర్ చెయ్యని రాజీనామా, కవితకు లేని బర్తరఫ్ నేడు బండి సంజయ్ నుంచి ఆశించడం బిఆర్ఎస్ నేతలకు తగునా అంటూ టి. బీజేపీ తన స్వరం పెంచింది.
Rajinikanth's highly anticipated sequel Jailer 2 directed by Nelson Dilipkumar is all set to hit…
Tamil actress Divya Bharathi, known for Bachelor and her special appearance in Maharaja, has sparked…