Telugu

జనసేన రాజకీయ పార్టీనా? బ్రోకరేజ్ సంస్థనా?

ఉన్నట్టుండి బీజేపీ జనసేన, పవన్ కళ్యాణ్ పై విరుచుపడింది. ఆ పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి కృష్ణ సాగర్ రావు పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసారు. దక్షిణ భారతదేశంలో పెరియార్ స్ఫూర్తితో వస్తున్నానని చెప్తున్న పవన్ కల్యాణ్‌వి అవకాశవాద రాజకీయాలు అని ఆయన ఆరోపించారు.

ADVERTISEMENT

పవన్ కల్యాణ్‌ ప్రాంతీయ వాదంతో పబ్బం గడపాలని చూస్తున్నారు. జనసేన రాజకీయ పార్టీనా? బ్రోకరేజ్ సంస్థనా? అని తీవ్ర వ్యాఖ్యలు చేసారు. జనసేనకు కార్యవర్గం లేదు. లోగో, జెండా ఉన్నాయి కానీ డైరెక్షన్ లేదు. జనసేన సినిమా విడుదల కాకముందే ఫెయిల్‌ అయిందని ఆయన ఆరోపించారు.

పవన్ కల్యాణ్ తెలంగాణ వ్యతిరేకి. తెలంగాణ ఉద్యమకారులు, అమరవీరులు, కేసీఆర్ కుటుంబంపై పవన్ అనేక వాక్యాలు చేశారు. ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్‌ను పవన్ కల్యాణ్ పొగడడం వెనుక ఆంతర్యమేమిటి? అని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్‌ది భజన పార్టీ. ఏపీలో చంద్రబాబును, తెలంగాణలో కేసీఆర్ పొగడడం అంటేనే.. ప్యాకేజీల పార్టీగా కనబడుతుందని ఆయన అన్నారు

ఏపీలో పెరుగన్నం తిని, తెలంగాణలో బిర్యానీ తినడం కాదు రాజకీయం అంటే! పవన్ యాత్రకు దిక్కు మొక్కులేదు. ఆ యాత్రకు లక్ష్యం కూడా లేదు అని తీవ్ర స్థాయిలో నిందించారు. ఉన్నఫలంగా బీజేపీ నాయకులు పవన్ కళ్యాణ్ పై ఎందుకు ఎటాక్ చేస్తున్నారో మరి. దీనిబట్టి బీజేపీ జనసేన మధ్య చెందినదే అనుకోవాలా?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Jailer 2: Shoot Wrapped, But Rajini Is Back

Jailer 2 is back in the news for an interesting reason. Rajinikanth had recently said…

17 minutes ago

గలగలా గోదావరి, బిరబిరా కృష్ణమ్మ…

దశాబ్దాల వెలిగొండ ప్రాజెక్టులో నిన్న నీళ్ళు పారాయి. అలాగే దశాబ్దాలుగా విశాఖ వాసులు ఎదురు చూస్తున్న గోదావరి జలాలు పోలవరం…

23 minutes ago