ఇదేమి లక్ష్యం కామ్రేడ్స్?

BJP-Telangana-Party-Meeting-2019-Electionsకామారెడ్డిలో జరిగిన పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశాలలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో భాజపా ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలవకుండా సీపీఎం పనిచేస్తుందని చెప్పడం విశేషం.తెలంగాణాలో సీపీఎం, బీఎల్‌ఎఫ్‌ ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పోటీ చేసి ఎన్నికల్లో గెలుపు బావుటా ఎగురవేస్తామన్నారు.

[m9ad]

ADVERTISEMENT

అంతా బానే ఉంది కానీ బీజేపీని తెలంగాణాలో అధికారంలోకి రానివ్వకపోవడమేంటో? తెలంగాణలో బిజెపికి ఉన్నదే ఐదు సీట్లు వారిని గెలవనివ్వకుండా చేయడమే సిపిఎం లక్ష్యమా? మిగతావన్నీ పక్కన పెడితే అసలు వామపక్షాలు దేశ రాజకీయాలు గానీ రాష్ట్ర రాజకీయాలను గానీ ప్రభావితం చేసే శక్తీ కలిగి ఉన్నాయా?

ఇవాళ రేపు పొత్తులు పెట్టుకుని ఏదో ఒక రకంగా ఒకటో అరో సీట్లు గెలుచుకునే [ప్రయత్నమే తప్ప అంతకు మించి చేయగలిగేది ఏమీ లేదు. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఎలాగైనా తమవైపు తిప్పుకోవాలని చూస్తున్నారు. అయితే సిపిఎం నాయకులకు పవన్ కళ్యాణ్ ఇప్పటిదాకా డైరెక్టుగా అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు.

ADVERTISEMENT
Latest Stories