ఏపీ ఎన్నికల సంఘం ఫోన్లు కూడా ట్యాపింగ్? బోండా ఉమా

రాష్ట్ర విభజన తర్వాత ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులుగా పగ్గాలు చేపట్టిన చంద్రబాబు నాయుడు, కేసీఆర్‌ మద్య ఘర్షణ వాతావరణం ఉండేది. దానికి కారణాలు, పర్యవసనాల గురించి అందరికీ తెలుసు. ఇప్పుడు ఆ చరిత్ర అనవసరం. కానీ చంద్రబాబు నాయుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని బయటపెట్టడంతో అంతవరకు ఎగిరెగిరిపడిన కేసీఆర్‌ ఒక్కసారిగా చల్లబడిపోయారు. ఆ తర్వాత ఇద్దరూ తమ తమ రాష్ట్రాల సమస్యలు, అభివృద్ధి పనులతో బిజీ అయిపోయారు.

ADVERTISEMENT

మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలలో ఒకేసారి ‘ఫోన్ ట్యాపింగ్’ వ్యవహారాల ఎపిసోడ్ మొదలైంది. తెలంగాణ నిఘా విభాగం మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అవడంతో, ఏపీలో కూడా ప్రకంపనలు మొదలయ్యాయి. ఆయన ఏపీలో వైసీపికి సాయపడిన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

అది నిజమో కాదో తెలీదు కానీ వైసీపి ప్రభుత్వం కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తోందని టిడిపి సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా ఈరోజు పెద్ద బాంబు పేల్చారు.

ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ, “జగన్‌ ప్రభుత్వం ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాపింగ్ చేయించి మాపై నిఘా పెట్టింది. మా వ్యూహాలు, మా కదలికల గురించి తెలుసుకోనేందుకు ఫోన్ ట్యాపింగ్ చేయిస్తోంది. దీని కోసం తాడేపల్లి ప్యాలస్‌లో ఇద్దరికి బాధ్యత అప్పగించింది.

ప్రతిపక్ష నేతల ఫోన్లు మాత్రమే కాదు… జగన్‌ ప్రభుత్వంలో ఉన్నతాధికారుల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేయిస్తోంది. చివరికి రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారుల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేయించి రహస్యంగా వివరాలు సేకరిస్తోంది.

జగన్మోహన్‌ రెడ్డి పొద్దున లేస్తే నీతి నిజాయితీ, ధర్మం న్యాయం అంటూ నీతి కబుర్లు వల్లె వేస్తుంటారు. కానీ తెర వెనుక మాత్రం ఇటువంటి కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతూనే ఉన్నారు. ఈ విషయం వైసీపి మంత్రులే బయటపెట్టారు అంటూ పత్రికలలో వచ్చిన వార్తల క్లిపింగ్ కూడా బోండా ఉమా మీడియాకు చూపారు.

ప్రతిపక్షాల, ఎన్నికల సంఘం అధికారుల ఫోన్లు ట్యాపింగ్ చేయడం తీవ్ర నేరం. దీనిపై రాష్ట్ర, కేంద్ర ఎన్నికల కమీషన్‌కు ఫిర్యాదు చేసి ఫోన్ ట్యాపింగ్ చేస్తున్న జగన్‌ ప్రభుత్వంపై తక్షణం చర్యలు తీసుకోవాలని కోరుతాను ,” అని బోండా ఉమా అన్నారు.

ఒకవేళ బోండా ఉమా ఆరోపిస్తున్నట్లు జగన్‌ ప్రభుత్వం ఎన్నికల అధికారుల ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్లయితే, ఇది అక్రమాస్తుల కేసు కంటే చాలా తీవ్రమైనదే అవుతుంది. శాసనసభ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చిన రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం, కేసీఆర్‌ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలపై విచారణ జరిపిస్తూ ఏవిదంగా ఆయన మెడకు ఉచ్చులు సిద్దం చేస్తోందో రేపు ఏపీ శాసనసభ ఎన్నికలలో వైసీపి ఓడిపోతే జగన్మోహన్‌ రెడ్డి మెడకు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యావహారం చుట్టుకునే సూచనలు కనిపిస్తున్నాయి.

—

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Not Only Rajini, But He Also Can Deliver 500 Cr?

Rajinikanth is going to return to the big screen tomorrow with his new film Jailer…

22 minutes ago

స్థానికంలో మచ్చుకి కొన్ని ఆలోచనలు, అభిప్రాయాలు…

స్థానిక సంస్థల ఎన్నికలలో సీట్ల సర్దుబాట్ల విషయంలో సోషల్ మీడియాలో ఇరు వర్గాల మద్దతుదారులు చేస్తున్న వ్యాఖ్యలు చాలా ఆసక్తికరంగా…

43 minutes ago