
Bonda Uma's participation in Mudragada Padmanabham's event has fuelled speculation about his political future and his equation with the TDP leadership.
విజయవాడ టీడీపీ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా చర్యలు అటు టీడీపీ నేతలను ఇటు వైసీపీ నాయకులను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. తాజాగా జరిగిన వైసీపీ నేత, కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం సంస్కరణ సభలో టీడీపీ నేత బోండా ఉమా పాల్గొన్నారు.
అయితే బోండా ఉమా ముద్రగడ మీద ఉన్న ప్రత్యేకమైన అనుబంధంతోనో, తన సామాజికవర్గానికి చెందిన పెద్దాయన అనే గౌరవంతోనో ఆ సభలో వైసీపీ నేతలతో కలిసి సభ వేదిక పంచుకున్నారా.? లేదా కూటమి ప్రభుత్వంలో తనకు మంత్రి పదవి రాలేదు అనే అసంతృప్తిని పార్టీ అధిష్టానానికి తెలియచేయడానికి ఆ వేదికను ఎంచుకున్నారా.?
లేక రానున్న కాలంలో టీడీపీ సైకిల్ వదిలి వైసీపీ ఫ్యాన్ కింద సేద తీరడానికి బోండా ఉమా సిద్ధమయ్యారు అనే సంకేతాలు వైసీపీ శ్రేణులకు ఇచ్చేందుకు ఆ వేదికను తనకు అనుకులంగా మలచుకున్నారా.? అన్నది ఇక్కడ చర్చనీయాయంశంగా మారింది.
అయితే 2019 వైసీపీ ప్రభుత్వ హయాంలో బోండా ఉమా మీద వైసీపీ శ్రేణులు ఒక వీధి గుండాలు మాదిరి నడిరోడ్దు మీద కర్రలతో, ఇనుప రాడ్లతో దాడికి ప్రయత్నించారు. ఆ ఘటన అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచనలంగా మారింది. అయితే వైసీపీ పార్టీ నుంచి ఆ స్థాయి దాడులను ఎదుర్కొని పార్టీ కోసం నిలబడినందుకు గాను పార్టీ అధిష్టానం కూడా వంగవీటి రాధ ఆశించిన విజయవాడ సెంట్రల్ టికెట్ ను వంగవీటి రాధకు బదులు బోండా కు కట్టబెట్టింది.
అయితే బోండా మాత్రం అక్కడితో సంతృప్తి చెందక కూటమి ప్రభుత్వంలో తనకు మంత్రి పదవి వస్తుందని ఆశించారని, అయితే ఆ కోరిక నెరవేరకవడంతో పార్టీ అధిష్టానం మీద అసంతృప్తితో ఉన్నారని, ఆ కారణంగానే బోండా పార్టీ కార్యక్రమాలకు, ప్రభుత్వ కార్యక్రమాలకు దూరం జరిగారంటూ వార్తలు ప్రచారంలో ఉన్నాయి.
అలాగే పార్టీ కోసం పనిచేసిన నేతలకన్నా కూడా ఇతర పార్టీల నుండి వలస వచ్చిన నేతలకే ప్రభుత్వంలో పదవులు, టీడీపీ పార్టీలో గౌరవాలు దక్కాయంటూ వైసీపీ మాజీ నేత పార్ధసారధి ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇలా పార్టీ నిర్ణయాల మీద కూడా బోండా పలుమార్లు తన అసహనాన్ని ప్రదర్శించిన సందర్భాలు ఉన్నాయి.
దానికి తోడు బోండా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కూడా కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసి టీడీపీ – జనసేన బంధానికి తూట్లు పొడిచే ప్రయత్నం చేసారు. ఇటు నియోజకవర్గంలో కూడా బోండా పని తీరు పై పార్టీ శ్రేణులు కూడా అసంతృత్తి గా ఉన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇక ముద్రగడ సంతాప సభకు హాజరైన బోండా అక్కడ వైసీపీ నేతలతో సాన్నిహిత్యంగా ఉండడం, సభ వేదిక ను ఉద్దేశించి ముద్రగడ కాపు తుని ఉద్యమం నాటి టీడీపీ ప్రభుత్వాన్ని పడగొట్టిందని, ముద్రగడ నాటి టీడీపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి రాసిన లేఖల విషయంలో కూడా సీఎం బాబు ని కొంతమంది తప్పుదోవ పట్టించారంటూ అసందర్భమైన వ్యాఖ్యలు చేసి అటు టీడీపీ ని ఇరకాటం లో పడేయడంతో పాటుగా వైసీపీ కి అవకాశం అందించారు.
ఇలా బోండా వివాదాస్పద వ్యాఖ్యలు నానాటికి తారాస్థాయికి చేరుకోవడంతో బోండా పార్టీ పై తనకున్న అసంతృప్తితిని అధిష్టానాన్ని కి తెలియచెప్పేందుకే ఇలా ప్రవర్తిస్తున్నారా.? లేదా భవిష్యత్ లో వైసీపీ పట్ల జరగబోయే ఆకర్షణకు బోండా ఇప్పుడే సంకేతాలు సిద్ధం చేస్తున్నారా.?
India beat Afghanistan by 7 wickets in the second T20I in Delhi to take an…
With Rohith and Trigun emerging as the potential gamers in the Bigg Boss reality show,…