
రాజకీయాలలో ఉన్నవారు చిక్కుల్లో పడితే వెంటనే తమ కులం కార్డు ప్రయోగించి బయటపడే ప్రయత్నం చేస్తుంటారు. కానీ అనేక నేరాలు చేసిన నేరగాడిని పోలీసులు అరెస్ట్ చేస్తే తన కులం గురించి చెప్పుకుని బయటపడే ప్రయత్నం చేసిన దాఖలాలు లేవు.
కానీ ఆ నేరగాడు రాజకీయాలలో ఉంటే తప్పకుండా కులం కార్డు ప్రయోగిస్తాడు. ఇందుకు తాజా నిదర్శనంగా వైసీపి నేత బోరుగడ్డ అనిల్ కుమార్ కనిపిస్తున్నాడు.
అతనిపై ఒకటీ రెండూ కాదు… గుంటూరు జిల్లాలో 20పైకి పైగా కేసులున్నాయి. వైసీపి అధికారంలో ఉన్నప్పుడు అతని అరాచకాలకు అడ్డు ఆపు ఉండేది కాదు. గుంటూరు జిల్లా ప్రజలకు బోరుగడ్డ అంటే హడల్.
బోరుగడ్డ వైసీపిలో ఉన్నందున టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ మరియు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మాజీ భార్య పై వ్యక్తిగత దూషణలు పాటు అందరిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తుండేవాడు… అని అంటే ఆ నేరాన్ని తక్కువ చేసి చెప్పిన్నట్లవుతుంది. చాలా దారుణంగా తిట్టేవాడు. అతని నోటికి బలవని టిడిపి నేతలు, ముఖ్యంగా టిడిపి మహిళా నేతలు లేరంటే అతిశయోక్తి కాదు.
ఎప్పటికీ రాష్ట్రంలో వైసీపియే అధికారంలో ఉంటుంది… వైసీపి తనకు రక్షణ కవచంగా ఉంటుందని గుడ్డిగా నమ్మిన అనేకమందిలాగే బోరుగడ్డ అనిల్ కుమార్ కూడా చెలరేగిపోయాడు. కానీ వైసీపి ఓడిపోయింది. టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. బోరుగడ్డ పాపాలు బద్దలయ్యాయి.
గుంటూరు జిల్లా ఆరండల్ పేట పోలీస్ స్టేషన్‌లో అతనిపై కేసు నమోదు అయింది. పోలీసులు అరెస్ట్ చేసి ప్రశ్నించగా ఓ రాజకీయ నేరగాడిలాగే మాట్లాడాడు. తాను బలహీన వర్గానికి చెందినవాడిని కనుక టిడిపి నేతలను తిడుతుంటే రాజకీయాలలో బాగా పాపులర్ అవుతావని కొంతమంది వైసీపి నేతలు ప్రోత్సహించారని చెప్పాడు. రాజకీయాలలో త్వరగా ఎదగాలంటే ఇలాంటివన్నీ తప్పవని, నీ వెనుక మేమున్నామని వైసీపి నేతలు తనను ప్రోత్సహించేవారని బోరుగడ్డ పోలీసులకు చెప్పాడు. వారి ప్రోద్బలంతోనే తాను రెచ్చిపోయాను తప్ప, టిడిపి నేతల పట్ల తనకు ఎటువంటి శతృత్వం, ద్వేషభావం లేదని చెప్పాడు.
ఇప్పుడు పోలీసులు తనని అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తుంటే ఆరోజు తనను వెనుకనుండి ప్రోత్సహించిన వైసీపి నేతలు ఎవరూ సాయం చేసేందుకు ముందుకు రావడం లేదని బోరుగడ్డ బోరుమన్నాడు. కానీ పోలీసులు ఎంతగా ప్రశ్నించినా తనను ప్రోత్సహించిన వైసీపి నేతల పేర్లు చెప్పకపోవడం గమనిస్తే, వారు తప్పకుండా వచ్చి తనని కాపాడుతారనే చిన్న ఆశ బోరుగడ్డకి ఉన్నట్లు అర్దమవుతోంది.
వైసీపి అధికారంలో ఉన్నప్పుడు టిడిపి నేతలు బలవుతుండేవారు. కానీ ఆనాడు వైసీపి కోసం చేసిన తప్పుల వలన సొంత పార్టీవారు కూడా బలవుతున్నారు. వైసీపి కోసం పనిచేసిన వాలంటీర్లు రోడ్డున పడ్డారు. వైసీపి కోసం అరాచకాలు చేసినవారు ఒకరొకరుగా ఇలా జైలుకి వెళుతున్నారు. పాము తన పిల్లలని తానే మింగిన్నట్లు సొంత పార్టీ నేతలనే వైసీపి మింగేస్తుందన్న మాట!
బోరుగడ్డ కేసులో తెలుసుకోవలసిన మూడు విషయాలున్నాయి. 1. రాజకీయాలలో ఉండేవారు… లేదా ఎదగాలనుకునేవారు రాజకీయాలు చేస్తే పర్వాలేదు కానీ రాజకీయాల పేరుతో ఇటువంటి నేరాలు చేస్తే చిక్కుల్లో పడతారు. అప్పుడు వారిని ఆదుకునేందుకు ఏ నాయకుడు ముందుకు రాడు.
2. రాజకీయ నాయకులు సమాజంలో వ్యక్తులను ఏవిదంగా తమ స్వార్ద రాజకీయాలకు వాడుకుని బలి చేస్తారో గ్రహించేందుకు ఇదో చక్కటి ఉదాహరణ.
3. రాజకీయ పార్టీలు ఎల్లకాలం అధికారంలో ఉండవు. కానీ ఉంటాయని గుడ్డి భ్రమలో వాటి అండదండలు చూసుకొని చెలరేగిపోకూడదు. చెలరేగిపోయి జైలుకి వెళ్ళాల్సివస్తే అప్పుడు బాధపడకూడదు.
Vijay Deverakonda and Rashmika Mandanna visited Tirumala ahead of Ranabaali's release and offered prayers for…
The opposition’s march to the Supreme Court over voter-list revision has put the BJP in…