Telugu

ఉత్తరాంధ్రా వైసీపీ నేతల కన్నీటి రోధన…

2029 ఏపీలో అధికారంలోకి వచ్చేది మేమే…అప్పుడు టీడీపీ, జనసేన నేతలకు రప్ప రప్ప రాజకీయాల రుచి చూపిస్తాం అంటూ దాని తాలూకా పోస్టర్లతో, ఫ్లెక్సీ లతో వైసీపీ క్యాడర్ రెచ్చిపోతే, సర్దిచెప్పాల్సిన లీడర్లను రెచ్చకొట్టారు. అయితే నాడు రప్ప రప్ప నరుకుతాం అంటే తప్పేముంది అంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ కూడా ఈ తరహా రాజకీయానికి తన మద్దతు ప్రకటించారు.

ఈ నేపథ్యంలో నాడు అలా రెచ్చిపోయిన వైసీపీ నేడు కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. ఇప్పటికే వైసీపీ ఉత్తరాంధ్ర కీలక నాయకుడు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియా సాక్షిగా పలుమార్లు కన్నీరు కార్చారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పై తానూ చేసిన అనుచిత వ్యాఖ్యలను ప్రత్యర్థి పార్టీల నేతలు తిరిగి గుర్తుచేసినందుకు గాను ఒకసారి,

ADVERTISEMENT

తాజాగా తన మేనల్లుడు చిన్న శ్రీను వైసీపీ కి గుడ్ బై చెప్పి టీడీపీ కండువా కప్పుకున్న సందర్భంగా మరోమారు కన్నీరు పెట్టుకున్నారు. వైఎస్ఆర్ పై విమర్శల విషయంలో తానూ నిర్దోషిని అంటూ నాడు, చిన్న శ్రీను పార్టీ మార్పు లో తన ప్రమేయం లేదని నేడు ఇలా తన కన్నీటితో అధినేత జగన్ కు తన చిత్తశుద్ధి తెలియచేసే ప్రయత్నం చేసారు బొత్స.

ఇక బొత్స బాటలోనే ఆయన మరో బంధువు, శీను బావ అప్పలనాయుడు కూడా చిన్న శీను పార్టీ మార్పు పై కన్నీరు కార్చాల్సిన పరిస్థితి వచ్చింది. చిన్న శీను పార్టీ మార్పుతో వైసీపీ అధిష్టానం ఉత్తరాంధ్ర పై ద్రుష్టి సారిస్తూ ఆ ప్రాంతంలో క్షేత్ర స్థాయి నుంచి అధికార మార్పిడికి నడుంబిగించింది.

ఇందులో భాగంగానే నెల్లిమర్ల నియోజకవర్గం పార్టీ ఇంచార్జ్ బాధ్యతల నుంచి అప్పలనాయుడు ను తొలగిస్తూ, ఆయన స్థానంలో గదల సన్యాసి నాయుడిని నియమిస్తున్నట్టు పార్టీ ప్రకటించింది. అలాగే విజయనగరం జిల్లా అధ్యక్షుడిగా చిన్న శీను స్థానంలో బెల్లాన చంద్రశేఖర్ ను నియమించింది. దీనితో జిల్లా పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న అప్పలనాయుడు భావోద్వేగానికి గురయ్యి కన్నీరు పెట్టుకున్నారు.

చిన్న శీను పార్టీ మార్పు తో తనకు ఎటువంటి సంబంధం లేదని, ఆయన పార్టీ మార్పుతో తానూ రాజకీయంగా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందంటూ పార్టీ సమావేశంలో కన్నీరు పెట్టుకున్నారు అప్పలనాయుడు. చివరికి శీను పార్టీ మార్పు ఉత్తరాంధ్ర వైసీపీ నేతల కన్నీటికి కారణంగా నిలిచిందని, అలాగే బొత్స కుటుంబానికి అనేక రాజకీయ ఇబ్బందులను తెచ్చిపెట్టాయని చెప్పకతప్పదేమో..!

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

CM Vijay London Tour: Many Doubts Already!

Tamil Nadu Chief Minister Vijay is currently on an official visit to London. The tour…

16 minutes ago

Kayadu Lohar’s Choice Says A Lot About Her Career

Kayadu Lohar is getting opportunities in Bollywood, but the actress does not seem to be…

47 minutes ago