Telugu

హేయ్ బోయపాటి… మళ్ళీ వేసేసారు..!

“మెగాస్టార్ అభిమానులందరికీ నేనొక్కటే హామీ ఇస్తున్నా, గుండె మీద చెయ్యి వేసుకుని సినిమా చూడండి” – ‘వినయ విధేయ రామ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు బోయపాటి శ్రీను చేసిన వ్యాఖ్యలివి. సినిమా పట్ల ఫ్యాన్స్ లో మిక్కిలి నమ్మకాన్ని కలిగించిన బోయపాటి, ఆ తర్వాత మెగా ఫ్యాన్స్ కు చేదు జ్ఞాపకాలను మిగిల్చిన విషయం తెలిసిందే.

ADVERTISEMENT

“గుండెల మీద చెయ్యి వేసుకుని మీరు చూసి వచ్చేటంత మంచి సినిమా తీసి మీ ముందుకొస్తున్నాం మేము” – ‘అఖండ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు బోయపాటి శ్రీను నందమూరి అభిమానులకు సినిమాపై హామీనిస్తూ పలికిన పలుకులివి. మరి ‘అఖండ’తో ఎలాంటి అనుభూతులను మిగులుస్తారో వేచిచూడాలి.

అయితే, సెంటిమెంట్ కు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే సినీ పరిశ్రమలో ఇలాంటి కాకతాళీయమైన అంశాలను నెటిజన్లు ఎప్పుడూ గుర్తు చేస్తుంటారు. అందులో భాగంగానే ‘వినయ విధేయ రామ’ చేదు జ్ఞాపకాలు మళ్ళీ తెరపైకి వచ్చాయి.

ఈ రెండు ఈవెంట్స్ లోనూ బోయపాటి “ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది, నేను త్వరగా ముగిస్తాను” అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. సెంటిమెంట్ ఇండస్ట్రీ కదా… ఈ మాత్రం పోలికలు సహజమే మరి! కానీ ‘చరిత్ర’ను తిరగ రాస్తాం అనేది నందమూరి ఫ్యాన్స్ మాటలు!

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by
Tags: cross link

Recent Posts

రేవంత్ కంచుకోటలో కవిత పాంచజన్యం.. వినిపిస్తుందా?

ఆటలో అరటిపండు.. అంటే ఇదేనేమో? తెలంగాణలో రెండు జాతీయ పార్టీలు, కేసీఆర్‌ నేతృత్వంలోని ఓ బలమైన ప్రాంతీయ పార్టీ మద్య…

4 minutes ago

Irumudi OTT Triggers Backlash Over a Troubling Hero Elevation

There is an uncomfortable pattern in recent Telugu commercial cinema. Sexual violence, sexual threats and…

15 minutes ago