Telugu

టెక్నాలజీ ఉన్న ప్రతీచోట తెలుగువాడు: క్రెడిట్ చంద్రబాబుదే!

నాడు ఇంజనీరింగ్ కాలేజీలలో చదువుకొని దేశవిదేశాలలో స్థిరపడిన ప్రతీ తెలుగువ్యక్తి ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు పేరు చెప్పుకోకుండా ఉండరు.

ఆయన దూరదృష్టితో హైదరాబాద్‌కి హైటెక్ సిటీ, ఐటి కంపెనీలు, ఇండియన్ బిజినెస్ మేనేజిమెంట్ స్కూల్ వంటివన్నీ తీసుకురావడం వల్లనే తాము, తమ తర్వాత తరంవారు కూడా జీవితంలో ఉన్నతస్థాయికి ఎదగగలిగామని చెప్పుకుంటారు. ఇందుకు సర్వదా చంద్రబాబు నాయుడుకి రుణపడి ఉంటామని చెప్పుకుంటారు.

ADVERTISEMENT

ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను నిన్న గుంటూరు జిల్లా వింజనంపాడు కిట్స్ ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన యువ 2కే26 వేడుకలలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఆయన విద్యార్ధులను ఉద్దేశ్యించి ప్రసంగిస్తూ, “ప్రపంచంలో టెక్నాలజీ ఎక్కడ ఉంటే అక్కడ మన తెలుగువాళ్ళు ఉండేలా చేసిన గొప్ప వ్యక్తి ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు. ఆయనకు అంత దూరదృష్టి ఉంది కనుకనే ఇప్పుడు ఆ టెక్నాలజీని తీసుకువచ్చి మన రాజధాని అమరావతిలో పెడుతున్నారు.

ఓ తండ్రి ఏవిధంగా తన పిల్లలు ఉన్నత స్థాయికి ఎదగాలనుకుంటాడో అదేవిధంగా సిఎం చంద్రబాబు నాయుడు కూడా ఏపీలో మీ వంటి యువత కూడా టెక్నాలజీని అందిపుచ్చుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నారు.

అయన చేయాల్సింది చేస్తున్నారు. కనుక మీరు కూడా ఆ టెక్నాలజీ గురించి నేర్చుకొని అది అందించే ఫలాలు పొందేందుకు అందరూ సిద్దంగా ఉండాలి. ఆయన మీ యువతపైనే నమ్మకం పెట్టుకొని అమరావతికి క్వాంటం వ్యాలీని తెస్తున్నారు. దానిని అందిపుచ్చుకోవడానికి మీరందరూ సిద్ధంగా ఉండాలి.

ఇదివరకు మీ రాజధాని ఏది? అని ఎవరైనా అడిగితే సమాధానం చెప్పలేక సిగ్గుతో తల దించుకోవాల్సి వచ్చేది. కానీ అమరావతిలకి పార్లమెంట్ చేత చట్టబద్దత కల్పించి శాశ్విత రాజధానిగా నిలుపుతున్నారు. ఇప్పుడు మన మందరం గర్వంగా మా కేరాఫ్ అడ్రస్ అమరావతి అని చెప్పుకోగలుగుతున్నాము.

ఆంధ్రుల ఆత్మాభిమానం కాపాడి, అత్యద్భుతమైన రాజధానిని నిర్మిస్తున్నందుకు, గొప్ప టెక్నాలజీని అందిస్తున్నందుకు సిఎం చంద్రబాబు నాయుడుగారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను,” అని బోయపాటి శ్రీను అన్నారు.

ఒక సిఎం లేదా నాయకుడు తన గురించి తాను చెప్పుకోవడమో లేదా తన మంత్రులు, పార్టీ నేతల చేత పొగిడించుకోవడం, చిత్రపటాలకు పాలాభిషేకాలు చేయించుకోవడం రోజూ చూస్తూనే ఉన్నాము.

కానీ ఈవిధంగా ప్రజలు, మేలు పొందినవారు చంద్రబాబు నాయుడు గొప్పదనం గురించి చెప్పి అయనకు ధన్యవాదాలు తెలుపుతుండటం చాలా గొప్ప విషయం కదా? ఎంత డబ్బిచ్చి పబ్లిసిటీ చేయించుకున్నా ఇలాంటి ప్రశంశలు దొరకవు కదా?

చంద్రబాబు నాయుడు గొప్పదనాన్ని, దూరదృష్టిని లోకమంతా చూడగలుగుతోంది కానీ జగన్‌ టీమ్‌ తప్ప.. వై?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Ranabaali US: Advance Sales & Breakeven Target No Sync

Vijay Deverakonda’s Ranabaali is heading towards release with a big overseas target, but the early…

8 hours ago

AK47 New Date: Trivikram About to Break His Promise?

After missing its October 9 release, Venkatesh and Trivikram’s Aadarsha Kutumbam AK47 was reportedly heading…

8 hours ago