
“అయ్యా! వధూవరులను త్వరగా తీసుకురండి… ముహూర్తానికి టైమ్ అవుతోంది,” అని పంతులుగారు అంటే “అయ్యా ‘పెళ్ళి కొడుకు జంప్’ లేదా ‘పెళ్ళి కూతురు జంప్’ అనే మాట ఇప్పుడు తరచూ వినిపిస్తోంది. ఇష్టం లేని పెళ్ళి చేసుకోలేక లేదా అప్పటికే వేరొకరితో ప్రేమలో ఉండటం వలన ఇటువంటి జంపింగ్‌లు జరుగుతున్నాయని సరిపెట్టుకోవచ్చు.
కానీ “అయ్యా! వధూవరులను త్వరగా తీసుకురండి… ముహూర్తానికి టైమ్ అవుతోంది,” అని పంతులుగారు అన్నప్పుడు “ఉండవయ్యా…. పెళ్ళి కూతురు తల్లి కనిపించడం లేదనో లేదా పెళ్ళి కొడుకు తండ్రి కనిపించడం లేదనే” మాటలు కూడా ఇప్పుడు వినిపిస్తున్నాయి. అంటే వాళ్ళు కూడా జంప్ చేసేస్తున్నారన్న మాట! అదేదో వేరేవారితో జంపింగ్ అన్నా తట్టుకోవచ్చు… కానీ కాబోయే అల్లుడుతోనో… కోడలితోనో అయితేనే తట్టుకోవడం కష్టం. కానీ ఇటువంటి జంపింగ్‌లు కూడా ఈ మద్య జరుగుతున్నాయి.
ఇప్పుడు జంపింగ్ 2.0 వెర్షన్ కూడా వచ్చేసింది. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీ జిల్లాలో పెళ్ళి కూతురు తండ్రి, పెళ్ళి కొడుకు తల్లితో జంప్ చేసేశారు. వారి కొడుకు, కూతురు పెళ్ళి నిశ్చయం చేసుకున్నాక రెండు ఇళ్ళ మద్య రాకపోకలు మొదలయ్యాయి.
జీవిత భాగస్వాములు కోల్పోయిన వారిద్దరి మద్య అప్పుడే ప్రేమ చిగురించింది. కానీ తమ ప్రేమని ‘పిల్లలు’ సమాజం అంగీకరించదని వారికి తెలుసు. కనుక పెళ్ళికి వారం రోజుల ముందు ఇద్దరూ జంప్! తర్వాత పోలీసులు దర్యాప్తు చేస్తే ఈ విషయం బయటపడింది. దాంతో పెళ్ళి రద్దు చేసుకున్నారు.
ఈ రకరకాల జంపింగ్స్ గురించి వింటునప్పుడు సమాజం ఆలోచనా ధోరణి, అలవాట్లు ఇంత వేగంగా మారిపోతున్నాయా? వ్యక్తిగత, శారీరిక అవసరాల కోసం సమాజాన్ని చూసి భయపడేదేలే!అని భావిస్తున్నారా? ఈ విషయంలో అమెరికా, యూరోప్ దేశాల కంటే మనమే ముందున్నామా?అనే సందేహాలు కలుగుతాయి.
Telugu cinema is facing a quiet but noticeable problem. Everything is starting to sound the…
Royal Challengers Bengaluru defeated Delhi Capitals in the 39th match of IPL 2026 at the…