Telugu

చిన్న శ్రీను గురించి ముందే తెలుసన్నప్పుడు కన్నీళ్ళు దేనికి?

ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలలో చిరకాలం కలిసి పని చేసిన ఉద్యోగుల మద్య అనుబందం ఏర్పడటం, ఒకరు వెళ్ళిపోతుంటే మిగిలినవారు బాధ పడటం సహజమే.

కానీ రాజకీయ పార్టీలలో నాయకుల మద్య అటువంటి అనుబంధం ఏర్పడటం కష్టమే. కారణం.. వారి మద్య టికెట్లు, పదవులు, అధికారం కోసం ఎల్లప్పుడూ పోటీ నెలకొని ఉండటమే.

ADVERTISEMENT

అందువల్లే ఓ నాయకుడు లేదా ప్రజా ప్రతినిథి వేరే పార్టీలోకి వెళ్ళిపోతే బాధపడే బదులు వెంటనే పరస్పరం కత్తులు దూసుకుంటుంటారు.

అయితే మేనల్లుడు చిన్న శ్రీను టీడీపిలోకి వెళ్ళిపోయినందుకు వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ భావోద్వేగానికి గురవుతున్నారు. జిల్లా స్థాయి పార్టీ సమావేశాలలో పదేపదే కంట తడిపెడుతున్నారు. నేడు మరోసారి కంట తడి పెట్టారు.

అయితే “చిన్న శ్రీను పార్టీ వీడి వెళ్ళిపోతాడని నాకు 8 నెలల ముందే తెలుసు. అందుకే నా కుమార్తెను రాజకీయ వారసురాలుగా తెచ్చానని,” బొత్స సత్యనారాయణ ఇటీవలే ఓ సమావేశంలో చెప్పారు.

“చిన్న శ్రీను వెళ్ళిపోయినా ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇప్పుడు నా కుమార్తె అందరికీ అందుబాటులో ఉంటూ పార్టీ వ్యవహారాలు చూసుకుంటారని,” ఆయనే కార్యకర్తలకు చెప్పారు.

చిన్న శ్రీను గురించి 8 నెలల ముందే తెలుసన్నప్పుడు ఆయనతో బొత్స సత్యనారాయణ మాట్లాడి పార్టీ మారవద్దని వారించారా?కనీసం ఈ విషయం జగన్‌ చెవిలో వేశారా?

ఒకవేళ వారించి ఉండి ఉంటే, తాను వారించినా వెళ్ళిపోయాడని కన్నీళ్ళు పెట్టుకున్నా అర్థం ఉంటుంది. లేదా జగన్‌ చెవిలో వేసినా ఇద్దరూ పట్టించుకోలేదని చెప్పుకొని బాధపడినా అర్థం ఉంటుంది.

కానీ చిన్న శ్రీను ఇంకా జెడ్పీ చైర్మన్‌ పదవిలో ఉండగానే, ఈసారి ఆ పదవి తన కూతురిదని బొత్స సత్యనారాయణ ప్రకటించారు. ఇది మేనల్లుడు చిన్న శ్రీనుని అవమానించడం కాదా?అలా అవమానించి ఇప్పుడు అయన వెళ్ళిపోయాడని పదేపదే కన్నీళ్ళు పెట్టుకోవడం దేనికి?జిల్లాలో తన కుటుంబానికి అతను అడ్డు తొలగిపోయాడని సంతోషించాలి కానీ బాధపడటం దేనికి?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

చిన్న సినిమాలు చూపిస్తున్న పెద్ద దారి..

సినిమా అంటే భారీ బడ్జెట్‌.. స్టార్‌ హీరో.. వందల కోట్ల మార్కెట్‌.. ఇదే ఇప్పుడు టాలీవుడ్‌లో విజయానికి కొలమానంగా మారినట్లు…

15 minutes ago

Vishwanath and Sons OTT Verdict: Shocking Reality Check?

Suriya's Vishwanath and Sons directed by Venky Atluri was released in theatres on August 14th…

29 minutes ago