
అహంకారం పతనానికి దారి తీస్తుందని తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ, ఆంధ్రాలో వైసీపీ ఓటమితో స్పష్టమైంది. లేకుంటే తెలంగాణని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి చూపిన కేసీఆర్‌ని ప్రజలు ఎందుకు కాదనుకుంటారు? సంక్షేమ పధకాల పేరుతో అప్పనంగా డబ్బులిస్తున్న జగన్‌ని ఎందుకు కాదనుకుంటారు?
రాష్ట్ర విభజన తర్వాత దయనీయ పరిస్థితిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిన పెట్టి, ప్రజల ఆత్మగౌరవం కాపాడేందుకు రాజధాని అమరావతిని నిర్మిస్తున్న సిఎం చంద్రబాబు నాయుడుని కూడా 2019 ఎన్నికలలో ప్రజలు వద్దనుకున్నారు. ఆ రాజకీయ తప్పిదాలను ఆయన సరిదిద్దుకున్నారు కనుకనే ప్రజలు మళ్ళీ కూటమిని గెలిపించారు.
తెలంగాణలో అత్యంత శక్తివంతమైన పార్టీగా ఎదిగిన బిఆర్ఎస్ పార్టీ పతనానికి కారణం కేసీఆర్ అహంకారమేనని ఒప్పుకోలేక, జనానికి చెప్పుకోలేకనే కాంగ్రెస్ మోసపూరిత హామీలు కారణంగా ఓడిపోయామని సర్ధి చెప్పుకోవడాన్ని అర్దం చేసుకోవచ్చు.
కానీ కేసీఆర్, కేటీఆర్, కల్వకుంట్ల కవిత ముగ్గురికీ అహంకారం ఇంకా అలాగే ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ‘చిల్లరగాడు’ అంటూ కేటీఆర్ అనడం, ఆంధ్రా బిర్యానీ (పేడలా ఉంటుందని) గురించి మా తండ్రి కేసీఆర్ ఎప్పుడో చెప్పారుగా అంటూ కల్వకుంట్ల కవిత అనడం వారి అహంకారానికి తాజా నిదర్శనాలే.
‘నాడు ఉద్యమ సమయంలో తెలంగాణ ప్రజలలో చైతన్యం రగిలించడానికే ఆంధ్రావాళ్ళ గురించి ఆవిదంగా మాట్లాడాను తప్ప నాకు ఎటువంటి ద్వేషమూ లేదని” కేసీఆర్ నమ్మబలికారు.
కానీ నేటికీ ఆయనతో సహా కల్వకుంట్ల కుటుంబంలో ప్రతీ ఒక్కరూ ఆంధ్రా ప్రజలను, పాలకులను ద్వేషిస్తూనే ఉన్నారని కల్వకుంట్ల కవిత మాటలతో మరోసారి బయటపడింది.
తెలంగాణలో ప్రతిపక్షంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ పదేపదే ఆంధ్రప్రదేశ్, సిఎం చంద్రబాబు నాయుడు గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? అంటే కాంగ్రెస్‌పార్టీని రాజకీయంగా ఎదుర్కోలేకపోతునందునే అని చెప్పక తప్పదు. అటువంటప్పుడు కల్వకుంట్ల కవిత బయటపెట్టినట్లు బిఆర్ఎస్ పార్టీని బీజేపిలో విలీనం చేసుకోవచ్చు కదా?
కానీ తాము ఎంతగానో అసహ్యించుకుంటున్న, ద్వేషిస్తున్న ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు పేరుతో తెలంగాణ సెంటిమెంట్ రాజేసుకొని, కాంగ్రెస్ పార్టీపై పైచేయి సాధించాలని ఆరాటపడుతుండటం వారికే సిగ్గుచేటు.. కాదా?
కల్వకుంట్ల కుటుంబ సభ్యులు ఈ అహంకారం వీడకపోతే, సిఎం చంద్రబాబు నాయుడు పేరు చెప్పుకొని తెలంగాణ సెంటిమెంట్ ఎంత రాజేసుకున్నా ప్రయోజనం ఉండదని గ్రహిస్తే వారికే మంచిది. ఎందుకంటే, వచ్చే ఎన్నికలు కాంగ్రెస్, బీజేపిల మద్య జరుగుతాయి తప్ప బిఆర్ఎస్ పార్టీతో కాదు కనుక!
Fauzi is now reportedly targeting a March 18, 2027 release. The film was originally scheduled…
The bodycam footage of an arrest has gone viral on Instagram. The footage shows police…