
కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన కొత్తలో ప్రధాని మోడీతో చాలా సఖ్యతగా ఉండేవారు. కానీ బండి సంజయ్ నేతృత్వంలో తెలంగాణ బిజేపి తమ పార్టీకి, ప్రభుత్వానికి ప్రమాదకరంగా మారడంతో, కేసీఆర్ ప్రధాని మోడీపై కత్తులు దూయడం మొదలుపెట్టారు.
తెలంగాణ తాను కోట్లాడి సంపాదించుకున్న సామ్రాజ్యమని భావించే కేసీఆర్ ‘నా బంగారి పుట్టలో వేలు పెడితే కుట్టనా?’అని అనుకున్నప్పుడు, జాతీయ స్థాయిలో బిజేపి పుట్టలో కేసీఆర్ వేలు పెడితే కుట్టకుండా ఉంటుందా?
ఒకవేళ అయన రాష్ట్ర స్థాయిలోనే బిజేపిని ఎదుర్కొంటూ ముందుకు సాగి ఉండి ఉంటే, నేడు అయన పరిస్థితి, బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి వేరేగా ఉండేదేమో? గతం గతః!
ఎన్నికలలో ఓటమి, కూతురు జైలు పాలవడం, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఫిరాయింపులు, రేవంత్ రెడ్డి ఏకుమేకవడం వంటి పరిణామాలు, ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, విద్యుత్ కొనుగోళ్ళు, రేసింగ్, ధరణి కేసులతో ఉక్కిరి బిక్కిరి అయిన కేసీఆర్ ఫామ్‌హౌసుకు పరిమితమై ‘రాజకీయ మౌనం’ పాటిస్తున్నారు.
ఈ పరిస్థితిలో బిజేపిలో విలీనం చేయాలనే ఆలోచన కూడా చేశారని, ఆయన కుమార్తె కల్వకుంట్ల కవిత స్వయంగా బయట పెట్టారు. కానీ ఆమె మాటలను ఎవరూ ఖండించలేదు. సమర్ధించలేదు. అంటే ఇంకా ఆ ఆప్షన్ కూడా ఓపెన్‌గా ఉంచుకున్నారనే భావించాల్సి ఉంటుంది.
కానీ బిజేపి పట్ల బీఆర్ఎస్ పార్టీ వైఖరిలో మళ్ళీ హటాత్తుగా మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది. నేడు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కేటీఆర్, జగదీశ్ రెడ్డి నోట మళ్ళీ బిజేపిపై విమర్శలు వినిపించాయి.
అంటే ఈసారి బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా ఎన్నికలలో గెలిచి రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి వస్తుందని గట్టిగా నమ్మకం కలిగిందా?లేక అందుకు దోహదపడే శక్తులు, సమీకరణాలు మారుతున్నట్లు భావిస్తున్నారా? అందుకే మళ్ళీ బిజేపి, కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు మొదలు పెట్టారా? అంటే త్వరలో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Andhra Pradesh is slowly preparing for another round of elections with the upcoming local body…
Recently, the trailer for Vijay Sethupathi's upcoming film Baththa directed by Balaji Tharaneetharan, was released…