
2023 సార్వత్రిక ఎన్నికల నాటి నుంచి తెరాస గా మారిన బిఆర్ఎస్ కి ఎన్నికలకు కలిసిరావడం లేదనుకుంటా. నాటి రాష్ట్ర స్థాయి ఎన్నికలలో బిఆర్ఎస్ ఓటమి, ఆ తరువాత జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో అసలు బిఆర్ఎస్ ఖాతానే తెరవలేకపోవడం,
ఇక జూబ్లీహిల్స్ వంటి బిఆర్ఎస్ పట్టున్న స్థానంలో సిట్టింగ్ స్థానాన్ని కూడా పార్టీ నిలబెట్టుకోలేకపోవడం, అటు పిమ్మట జరిగిన పంచాయితీ ఎన్నికలలో పట్టు నిలుపుకోలేకవడంతో బిఆర్ఎస్ కి గ్రహ దోషం పట్టినట్టు ఎన్నికల దోషం చుట్టుకుండా అన్న చర్చ జరుగుతుంది.
ఇప్పుడు కూడా అదే నిరూపితమైనట్టుగా నేడు విడుదలైన మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలలో సైతం బిఆర్ఎస్, కాంగ్రెస్ చేతిలో చిత్తయ్యింది. 116 మున్సిపల్ స్థానాలు, 7 కార్పొరేషనలకు గాను జరిగిన ఎన్నికలలో అధికార కాంగ్రెస్ తన హవా కొనసాగించింది.
దీనితో ఈ ఓటమి బిఆర్ఎస్ పార్టీకి చెందుతుందా.? లేదా కేసీఆర్ ఫామ్ హౌస్ కి పరిమితమైన నేపథ్యంలో పార్టీ బాధ్యతలను ముందుండి నడిపిస్తున్న కేటీఆర్ కి వర్తిస్తుందా.? అంటూ కేటీఆర్ నాయకత్వం పట్ల కొన్ని రాజకీయ ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
కాంగ్రెస్ తరుపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి – బిఆర్ఎస్ తరుపున పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలిసి ముందుండి నడిపిన ఈ ఎన్నికల సమరం రేవంత్ vs కేటీఆర్ గా ముందుకు కదిలింది. ఇరు పార్టీల అగ్రనేతలు తమ ప్రత్యర్థుల పై అనుచిత భాషతో విరుచుకుపడి మరి పార్టీ క్యాడర్లో జోష్ తెచ్చారు.
అయితే ఇందుకు కేటీఆర్ ఒకటి కాదు ఏకంగా పది మెట్లు కిందకు దిగి రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి ని కూడా అగౌరవపరుస్తూ రేవంత్ ను బూతులతో దూషించారు, వ్యక్తిగత హననానికి ఒడిగట్టారు. అంత చేసినా ఫలితం ఏమైనా పార్టీకి అనుకూలంగా మారిందా అంటే అందుకు బహిర్గతమైన బిఆర్ఎస్ ఫలితాలే ప్రత్యక్ష ఉదాహరణలుగా నిలుస్తున్నాయి.
నల్గొండ జిలాల్లో బిఆర్ఎస్ పై కాంగ్రెస్ పూర్తిగా పై చేయి సాధించి ఆ జిల్లాను క్లిన్ స్వీప్ చేసింది. ఇక మిగిలిన జిలాల్లో సైతం హస్తం గుర్తు గులాబీ కారుని దాటుకుని ముందుకు సాగింది. దీనితో కేటీఆర్ నాయకత్వాన జరిగిన ఏ ఒక్క ఎన్నికలో కూడా బిఆర్ఎస్ గెలుపు జెండా ఎగరేయలేకపోయింది, రేవంత్ పై ఏ ఒక్క విషయంలో కూడా కేటీఆర్ పై చేయి సాధించలేకపోయినట్టు అయ్యింది.
అందుచేత ఈ ఫలితాలను బిఆర్ఎస్ ఓటమిగా భావించాలా.? లేదా కేటీఆర్ నాయకత్వ లోపంగా చిత్రీకరించాలా.? అంటూ తెలంగాణ రాజకీయాలలో కేటీఆర్ రాజకీయ భవిష్యత్ చుట్టూ, ఆయన నాయకత్వ లక్షణాల చుట్టూ చర్చలు ఊపందుకోబోతున్నాయి.
మరి పార్టీకి ఇన్ని ఎన్నికల వ్యతిరేక ఫలితాలు చూసిన తరువాత బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పటికైనా ఫామ్ హౌస్ గడప దాటుతారా.? లేదా వెనకుండి కేటీఆర్ నాయకత్వాన్నే ముందుకు పంపుతారా.? అనేది చూడాలి..!
NTR fans are growing anxious about Trivikram’s ambitious mythological project, tentatively titled God of War,…
Team India started the T20I series against West Indies with a complete performance in Lucknow.…