Telugu

కేటీఆర్ పై కవిత నెగ్గినట్టేనా.?

ఒక్క ఓటమి బిఆర్ఎస్ పార్టీని అటు రాజకీయంగానూ ఇటు నైతికంగాను కుంగదీస్తుంది. పార్టీ ఓటమితో పార్టీ అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్ లో అజ్ఞాత జీవితం గడుపుతున్నారు. ఇది పార్టీని రాజకీయంగా బలహీనపరుస్తుంది.

ఇక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అర్ధం లేని ఆవేశంతో, అనుభవారాహిత్యంతో అటు తెలంగాణలో ఊసే లేని టీడీపీ పై లేనిపోని ఆరోపణలు చేస్తూ అందులోకి బాబు ని లాగుతూ రాజకీయంగా ఎదురుదెబ్బలు తింటున్నారు.

ADVERTISEMENT

అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి అనే కనీస గౌరవ – మర్యాదలు కూడా లేకుండా కేటీఆర్, రేవంత్ టార్గెట్ గా చేస్తున్న విమర్శలు బిఆర్ఎస్ ని నైతికంగా కుంగదీస్తుంది. ఇక దానికి తోడు బిఆర్ఎస్ – కవిత మధ్య సాగుతున్న రాజకీయ కోల్డ్ వార్ పార్టీ ఫలితాలను హీటెక్కిస్తున్నాయి.

బిఆర్ఎస్ లో కేసీఆర్ తప్ప తానూ ఎవ్వరిని తన నాయకుడిగా అంగీకరించను అంటూ కవిత చేసిన ప్రకటనలు కేటీఆర్ నాయకత్వం పై పలు అనుమానాలను లేవనెత్తాయి. అయితే అందుకు తగ్గట్టే కేటీఆర్ పార్టీ బాధ్యతలు భుజాన వేసుకున్న నాటి నుంచి నేటి వరకు జరిగిన ఏ ఒక్క రాజకీయ సంఘటన కూడా బిఆర్ఎస్ కి అనుకూలంగా మారలేదు.

కేటీఆర్ నాయకత్వానికి బలం చేకూర్చలేదు. కేటీఆర్ నాయకత్వంలో బిఆర్ఎస్ బలంగా ముందుకెళ్లేందుకు, ప్రత్యర్థి పార్టీల బలాన్ని బలహీనపరిచేందుకు ఆయన ఎంచుకున్న దారులు కానీ, వేసిన వ్యూహాలు కానీ ఏ ఒక్కటి ఫలితాలనివ్వలేదు అని నిర్దారణ జరిగిపోయింది.

అలాగే బిఆర్ఎస్ టార్గెట్ గా కవిత సంధిస్తున్న బాణాలు, ఆ పార్టీ ముఖ్యనేతల పై కవిత గురి పెడుతున్న అవినీతి ఆరోపణల అస్త్రాల ను ఆపడానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ చేతులెత్తేశారు. బిఆర్ఎస్ ఈ రకమైన నాయకత్వంతో ముందుకెళ్లినా, ఇటువంటి రాజకీయ వ్యూహాలతో కాంగ్రెస్ కి ఎదురెళ్ళినా అది బిఆర్ఎస్ ఓటమినే సూచిస్తుంది అంటూ కవిత చేసిన ప్రకటనలు ఫలితాల రూపంలో కళ్ళ ముందు కనపడుతున్నాయి.

దీనితో కవిత విమర్శల ప్రభావం బిఆర్ఎస్ ఫలితాలను ప్రభావం చేసిందనే భావించాలి. అలాగే కేటీఆర్ నాయకత్వం మీద ఆమె చేసిన పరోక్ష ప్రకటనలు ఇప్పుడు బిఆర్ఎస్ ఫలితాలకు సాక్ష్యాలుగా మారాయి.

రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ ని బలంగా ఢీ కొట్టగలిగే ప్రతిపక్షం లేకుండా పోయిందని, ఆ స్థానాన్ని తన జాగృతితో భర్తీ చేసేందుకు తానూ సిద్ధమంటూ ప్రకటించిన కవిత ఇప్పుడు ఎన్నికల ఫలితాల తరువాత బిఆర్ఎస్ పై ఆ పార్టీ నాయకత్వం పై తన స్వరాన్ని మరింత పెంచే ప్రమాదం ఉంది.

తెలంగాణ హక్కుల కోసం జాగృతి రాజీలేని పోరాటం అంటూ మొదలు పెట్టిన కవిత బీసీ రిజర్వేషన్ల అంశాన్ని ఉటకించారు. అలాగే గత పదేళ్ళుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న బిఆర్ఎస్ ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా పనిచేసిందని, దాని ఫలితమే ప్రస్తుతం బిఆర్ఎస్ పరిస్థితి అంటూ బిఆర్ఎస్ ఓటమికి సవాలక్ష కారణాలు విశ్లేషిస్తున్నారు కవిత.

ఇటువంటి నేపథ్యంలో కవిత ఆరోపణలకు మున్సిపల్ ఎన్నికలు సాక్ష్యులుగా మారిన నేపథ్యంలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అటు తన ప్రత్యర్థి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ పైనే కాదు తన సొంత సోదరి కవిత మీద కూడా ఓటమిని ఎదుర్కున్నట్టే భావించాలా.?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Pics: Kangan Turns Silver Style Into Pure Glamour

Kangan Baruah brings a flash of metallic glamour to this striking portrait series. Her silver…

16 minutes ago

‘Husharu 2’ Returns With a New Adventure

The makers of the 2018 youth entertainer ‘Husharu’ have officially announced its sequel, ‘Husharu 2’.…

35 minutes ago