
పాదయాత్రలు, జైలు జీవితంతో అందరూ ముఖ్యమంత్రులు కాలేకపోవచ్చు. కానీ ఆ రెంటి ద్వారా వారికి అనేక కొత్త విషయాలు తెలుస్తాయి.
పాదయత్రాలలో సామాన్య ప్రజల అవసరాలు, కష్టాలు, కన్నీళ్ళు, స్థానిక సమస్యల గురించి మంచి అవగాహన ఏర్పడుతుంది. కనుక అధికారంలోకి వస్తే వాటన్నిటినీ కాకపోయినా ఎన్నో కొన్ని పరిష్కరిస్తారు.
రాజకీయ నాయకులు జైలుకి వెళ్ళి వస్తే పార్టీలలో వారికి హీరోలుగా కొత్త గుర్తింపు లభించవచ్చు. కానీ వాస్తవానికి జైలు జీవితం వారిలో కూడా ఎంతో కొంత పరివర్తన కలిగిస్తుంది. కానీ పరివర్తన రాలేదని నిరూపించుకోవడానికే నాయకులు మొగ్గు చూపుతారు!
జైలుకి వెళ్ళినందుకు సిగ్గు పడాల్సింది పోయి, ‘జైలు జీవితాన్ని కూడా బాగా ఎంజాయ్ చేశామని’ నిసిగ్గుగా చెప్పుకుంటున్నారు. ఇది వేరే విషయం.
కాంగ్రెస్ మంత్రిపై దాడి కేసులో బీఆర్ఎస్ ఫైర్ బ్రాండ్ లీడర్ బాల్క సుమన్ కూడా జైలుకి వెళ్ళి ఈరోజు ఉదయం బెయిల్‌పై బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ, “నా కొడుకు పుట్టినరోజునాడు, హోలీ పండుగనాడు నన్ను జైల్లో నుంచి బయటకు రానీయకుండా అధికారులపై ఒత్తిడి చేశారు.
నాకు బెయిల్ వచ్చినా కుట్రపూరితంగా వ్యవహరించి ఆలస్యంగా విడుదలయ్యేలా చేశారు. నన్ను 16 రోజులు జైల్లో పెట్టినందుకు ఇప్పుడు సిఎం రేవంత్ రెడ్డి, మంత్రి వివేక్ మీ ఇద్దరి కళ్ళు చల్లబడ్డాయా?” అని ప్రశ్నించారు.
గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు, ఆయన తన కూతురు పెళ్ళి చేసుకునేందుకు కోర్టుని ఆశ్రయించి బెయిల్ తెచ్చుకోవాల్సి వచ్చింది. పెళ్ళి వేడుకలు పూర్తికాక ముందే బలవంతంగా మళ్ళీ జైలుకి పంపించేశారు.
కేసీఆర్ హయంలో తన రాజకీయ ప్రత్యర్ధులను ఈవిధంగా వేధించినప్పుడు వారు ఎంతగా మానసిక క్షోభకు గురయ్యారో బాల్క సుమన్ ఇప్పుడు తెలుసుకునే ఉంటారు. కానీ ఆ విషయం పైకి చెప్పలేరు. కానీ జైల్లో తాను అనుభవించిన మానసిక క్షోభనే తమ ప్రత్యర్ధులు కూడా అనుభవించారని గ్రహిస్తే చాలు.
Venkatesh’s much-hyped Aadarsha Kutumbam AK 47, directed by Trivikram, has been indefinitely postponed. Producer Naga…
The Ministry of External Affairs in India has amended the passport rules for minors of…