
బిఆర్ఎస్ పార్టీకి ఓ ధర్మ సందేహం కలిగింది. దేశంలో ఎన్నికల కమీషన్ ఉందా లేదా?అని. తమ పార్టీ టికెట్ మీద ఎమ్మెల్యేలుగా గెలిచిన కడియం శ్రీహరి, దానం నాగేందర్ మూడు నెలల్లోగానే కాంగ్రెస్ పార్టీలో చేరిపోయినా ఎన్నికల కమీషన్, అసెంబ్లీ స్పీకర్ ఏం చేస్తున్నారు?
తెలంగాణలో ప్రజాస్వామ్యం ఈవిదంగా ఖూనీ అవుతుంటే ఈ రెండు వ్యవస్థలు ప్రేక్షక పాత్రకి పరిమితం అయ్యాయి. ఇది నిర్లక్ష్యం కాదా?మేము పార్టీ మారిన వారిద్దరిపై ఫిరాయింపుల నిరోధింపు చట్టం క్రింద తక్షణం చర్యలు తీసుకోవలసిందిగా ఎన్నికల కమీషన్, అసెంబ్లీ స్పీకర్‌ని కోరుతున్నాము,” అంటూ బిఆర్ఎస్ పార్టీ ట్వీట్ చేస్తూ వారిద్దరూ సిఎం రేవంత్ రెడ్డితో దిగిన ఫోటోలను దానికి జోడించింది.
బిఆర్ఎస్ ట్వీట్ చూసిన వారెరికైనా మొట్ట మొదట కలిగే సందేహం, “ఆనాడు బిఆర్ఎస్ పార్టీ కూడా ఇలాగే కాంగ్రెస్, టిడిపి ఎమ్మెల్యేలను పార్టీలో ఫిరాయింపజేసుకుంది కదా?ఆనాడు అవి ఇలాగే మొత్తుకున్నప్పుడు బిఆర్ఎస్ నేతలు ఇలాగే చిర్నవ్వులు నవ్వారుగా?
ఆనాడు ఆ రెండు పార్టీలు ఇలాగే స్పీకర్‌ని కలిసి ఫిర్యాదు చేసినప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోనీయలేదు కదా?అప్పుడు బిఆర్ఎస్ పార్టీ చేసింది తప్పు కానప్పుడు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసింది తప్పు ఎలా అవుతుంది?” అని అనుకోకుండా ఉండరు.
కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఈ ఫిరాయింపుల సంస్కృతిని ప్రవేశపెట్టి, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది బిఆర్ఎస్ పార్టీయే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అదే చేస్తుంటే ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోతోందని బాధ పడటం దేనికి?
ఆనాడు తాము చేసింది తప్పని ఒప్పుకుని భవిష్యత్‌లో మళ్ళీ అటువంటి తప్పులు చేయమని బిఆర్ఎస్ పార్టీ హామీ ఇచ్చి, ఇప్పుడు ఈ తప్పుని సరిద్దాలని కోరుకొని ఉంటే అర్దముంటుంది. కానీ ఆరు నెలల్లోగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూలద్రోస్తామని బెదిరిస్తోంది కదా?
బిఆర్ఎస్ పార్టీ చేస్తే ఒప్పు… అదే ఇతరులు చేస్తే తప్పు అన్నట్లు వాదించడం ఆ పార్టీకే చెల్లు. తెలంగాణ ప్రజలు, పార్టీలు, మీడియా అందరూ తమని నిశితంగా గమనిస్తూనే ఉంటారని తెలిసి ఉన్నా పిల్లి కళ్ళు మూసుకొని పాలు త్రాగుతూ తనని ఎవరూ చూడటం లేదనుకున్నట్లు బిఆర్ఎస్ పార్టీ ప్రవర్తిస్తుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది కదా?
An F-1 visa applicant has reportedly come under scrutiny after USCIS questioned his entry into…
Gullak is returning with its fifth season after building a strong fan following over the…