
రేపు జరగనున్న ఉప రాష్ట్రపతి ఎన్నికలకు బిఆర్ఎస్ దూరం అంటూ ప్రకటించారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎన్డీయే అభ్యర్థిగా బీజేపీ రాధాకృష్ణన్ పేరును ప్రకటించగా, ఇండీ కూటమి అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డి పేరును ప్రతిపాదించింది కాంగ్రెస్.
అయితే ఇండీ కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి తెలంగాణ వాసి కాగా మన తెలుగు వాడికి, అందునా ముఖ్యంగా తెలంగాణ వాస్తవ్యుడికి రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ పార్టీలు రాజకీయాలకు అతీతంగా మద్దతు ప్రకటించాలి అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
అన్ని పార్టీల అధినేతలకు అప్లిల్ చేసారు.
అయితే టీడీపీ, జనసేన ఎన్డీయే లో భాగం కావడంతో రేవంత్ వినతిని పరిగణలోకి తీసుకునే అవకాశం లేదు. ఇక వైసీపీ సైతం బీజేపీ ని కాదని అడుగు ముందుకు వేసే సాహసం చేయజాలదు కావున వైసీపీ కూడా ఎన్డీయే అభ్యర్థి రాధాకృష్ణన్ వైపే మొగ్గు చూపింది.
ఇక తెలంగాణలో కాంగ్రెస్ ఇండీ కూటమికి, బీజేపీ ఎన్డీయే కూటమి మద్దతు తెలపగా మిగిలిన బిఆర్ఎస్ మాత్రం ‘కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముతో విరోధం’ అన్న సామెత మాదిరి తెలంగాణ వ్యక్తి అని కాంగ్రెస్ కు మద్దతు ప్రకటిస్తే బీజేపీ నుంచి ఎటువంటి రాజకీయ పర్యవసానాలు ఎదురవుతాయో అన్న భయం బిఆర్ఎస్ ను తెలంగాణ వ్యక్తి వైపుకి వెళ్లనియ్యకుండా ఆపుతుంది.
అలా అని ఇండీ కూటమిని కాదని ఎన్డీయే కూటమికి మద్దతు తెలిపితే ఇన్నాళ్ళుగా తెలంగాణ అనే సెంటిమెంట్ మీద నిర్మించిన బిఆర్ఎస్ రాజకీయ కోటను చేచేతుల కులదూసుకున్నట్టే అవుతుంది.
దానికి తోడు కాళేశ్వరం కేసుల నుంచి తప్పించుకోవడానికి తెలంగాణ వ్యక్తికీ ద్రోహం చేసి మరి బిఆర్ఎస్ బీజేపీ కి మద్దతు తెలిపింది అంటూ ప్రత్యర్థి కాంగ్రెస్ నుంచి ఎదురుదాడి మొదలవుతుంది. దీనితో బిఆర్ఎస్ కుడితిలో పడ్డ ఎలక మాదిరి అల్లాడాల్సిందే.
అయితే బీజేపీ ని కాదని ముందుకెళ్లలేని పరిస్థితిలో, కాంగ్రెస్ తో కలిసి నడవలేని దుస్థితిలో బిఆర్ఎస్ నిలబడింది. ఇలా బిఆర్ఎస్ ఉప రాష్ట్రపతి ఎన్నికల విషయంలో ముందు నుయ్యి వెనుక గొయ్యి చందంగా ఉండడంతో అసలు ఎన్నికల ఓటింగ్ కే బిఆర్ఎస్ దూరం అంటూ ప్రకటించారు కేటీఆర్. అయితే ఈ దూరం బీజేపీ తో దగ్గర కావడానికే అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కాళేశ్వరం కేసు సీబీఐ కి చేరడంతో బిఆర్ఎస్ గతంలో మాదిరి బీజేపీ పై దూకుడుగా రాజకీయం చెయ్యలేదు, బిఆర్ఎస్ వేసే ప్రతి రాజకీయ అడుగును బీజేపీ క్షుణ్ణంగా పరిశీలిస్తుంది, పరిశోధిస్తుంది.
అందుచేతనే బీజేపీ తో కయ్యామంటూ కాలు దూసేకంటే కూడా కామ్ గా ఉండడమే మేలనే అభిప్రాయం బిఆర్ఎస్ ను ఎటు నిర్ణయం తీసుకోలేని నిస్సహాయ స్థితిలోకి నెట్టేసిందా.?
బిఆర్ఎస్ త్వరలో బీజేపీ లో విలీనం కానుందని, ఆ దిశగా పార్టీలోని కొంతమంది ముఖ్యనాయకులు బీజేపీ తో తెరచాటు రాజకీయం నడుపుతూ బిఆర్ఎస్ లో కోవర్దులుగా పనిచేస్తున్నారంటూ కవిత ఆరోపిస్తున్న ఈ తరుణంలో కేటీఆర్ చాల జాగ్రత్తగా ఎటువంటి అపోహలకు తావివ్వకుండా దూరం అంటూ ప్రకటించి ఎన్నికల ఓటింగ్ ఉంచి పార్టీని తప్పించారా.?
Fauzi is now reportedly targeting a March 18, 2027 release. The film was originally scheduled…
The bodycam footage of an arrest has gone viral on Instagram. The footage shows police…