
పదేళ్ల అధికారం ఒక్కసారిగా చేజారిపోతే పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందో, ఆ పార్టీ నాయకుల రాజకీయ చర్యలు ఏ స్థాయికి దిగజారిపోతాయో బిఆర్ఎస్ పార్టీని చూస్తే యిట్టె అర్ధమయిపోతాయి.
తెలంగాణలో ప్రతిపక్షంలో ఉన్న బిఆర్ఎస్ అటు తెలంగాణ ప్రభుత్వం తో పాటు ఇటు ఏపీలో కూటమి ప్రభుత్వానికి కూడా ప్రతిపక్షంగా ఉండడానికి తెగ ఆరాటపడుతుంది.
అందుకు తగ్గట్టే అక్కడ అధికార కాంగ్రెస్ పై విమర్శలు చేయడానికి ఇక్కడ కూటమి పార్టీలను, ఆయా పార్టీల నేతలను కూడా టార్గెట్ చేస్తున్నారు బిఆర్ఎస్ నాయకులు.
మొన్న బనకచర్ల విషయంలో, నేడు పవన్ సినిమా హరిహర వీరమల్లు విషయంలోనూ బిఆర్ఎస్ ఇదే విధమైన రాజకీయం చేస్తూ తెలంగాణ ప్రజల సెంటిమెంట్ ను రెచ్చకొట్టే ప్రయత్నం చేస్తుంది.
పుష్ప సినిమా వివాదం తరువాత నుంచి తెలంగాణలో ఇక నుంచి ఏ చిత్రానికి బెనిఫిట్ షో ల అనుమతి కానీ, టికెట్ ధరల పెంపు కానీ ఉండబోదు అంటూ ముఖ్యమంత్రి రేవంత్ ఖరాకండిగా ప్రకటించారు.
ఈ నేపథ్యంలో తాజాగా విడుదలైన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు చిత్రానికి గాను తెలంగాణ ప్రభుత్వం ఈ షరతులను కాస్త సడలించి చిత్ర యూనిట్ కు బెనిఫిట్ షో ల నుంచి టికెట్ ధరల పెంపు వరకు అన్ని విషయాలలోనూ వెసులుబాటు కల్పించింది.
ఇక రాజకీయానికి వేళయరా అంటూ బిఆర్ఎస్ ముందుకొచ్చి పవన్ భుజాన గన్ను పెట్టి రేవంత్ రెడ్డి ని టార్గెట్ చేస్తూ, బాబు పై విమర్శలు మొదలుపెట్టింది. రేవంత్, పవన్, మోడీ, బాబు కలిసి తెలంగాణలో కేసీఆర్ సమూలంగా తుడిచిపెట్టిన పసుపు జెండాకు తిరిగి ప్రాణం పోసే ప్రయత్నాలు చేస్తున్నారు,
నాడు కేసీఆర్ టీడీపీ ని లేకుండా చేసినందుకు ప్రతిగా నేడు మోడీ, రేవంత్, పవన్, బాబు కలిసి ఇక్కడ కేసీఆర్ ని లేకుండా చేసేందుకు కుట్ర పన్నుతున్నారు అంటూ బిఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ఫైరయ్యారు.
మొన్నటిదాకా సినిమా టికెట్ల రేట్లు పెంచేదేలే అంటూ హంగామా చేసిన రేవంత్ కు ఇప్పుడు పవన్ హరిహర వీరమల్లు అనగానే గొంతులో ముళ్ళు దిగింది. పవన్ సినిమాలైతే రేట్లు పెంచుకోవచ్చా.? అంటూ కేటీఆర్ సాక్షిగా రేవంత్, బాబు మనిషి అని తెలంగాణ ప్రజలకు మరోసారి నిరూపించేందుకు సిద్ధమయ్యారు శ్రీనివాస్.
రేవంత్ రెడ్డి టీడీపీని వదిలి ఏళ్ళు గడుస్తున్నా, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఎదిగిన ఇంకా రేవంత్ ను టీడీపీ సైన్యంగాను, బాబు సేవకుడిగాను నిరూపించేందుకు బిఆర్ఎస్ ఆపసోపాలు పడుతూనే ఉంది.
అందులో భాగంగానే బనకచర్ల నీటి ప్రాజెక్ట్ నుంచి పవన్ సినిమా వరకు ప్రతి అంశంలోనూ రేవంత్ – బాబు అంటూ లేనిపోని రాజకీయాన్ని తెరమీదకు తేవడం, ఇదే వీరిద్దరి మధ్య బంధానికి సాక్ష్యం అంటూ తెలంగాణ ప్రజలను నమ్మించేందుకు, రెచ్చకొట్టేందుకు ప్రణాళికలు రచించడం బిఆర్ఎస్ దినచర్యలో భాగమయిపోయింది.
Fauzi is now reportedly targeting a March 18, 2027 release. The film was originally scheduled…
The bodycam footage of an arrest has gone viral on Instagram. The footage shows police…