Telugu

బిఆర్ఎస్ – వైసీపీ లకు కాక్రోచ్లు ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నాయా.?

బీజేపీ తో తెరచాటు రాజకీయం అంటూ వైసీపీ పై, బీజేపీ తో లోపాయకారి పొత్తు అంటూ బిఆర్ఎస్ పై గత కొన్నేళ్లుగా ఆరోపణలు, విమర్శలు వినిపిస్తూనే వస్తున్నాయి. అయితే ఈ విషయంలో బిఆర్ఎస్ ఎప్పటికప్పుడు ఆ వార్తలను ఖండిస్తూ, ఎదురుదాడి చేస్తూ ముందుకు సాగుతుంది.

కానీ వైసీపీ ఈ విషయంలో పూర్తిగా మౌనం పాటిస్తూ మౌనమే అర్ధాంగీకారం అన్నట్టుగా వ్యవహారాన్ని గుట్టు చప్పుడు కాకుండా ముందుకు తీసుకెళుతుంది. మేము సింగల్ అంటూనే తెరవెనుక బీజేపీ తో మింగిల్ అయ్యేందుకు సాయిరెడ్డి ద్వారా రాయబారాలు కూడా సాగించినట్టు, ఆ రాయబారాలతో అనుకున్న ఫలితాలను కూడా సాధించినట్టు తాజాగా సాయిరెడ్డి బయటపెట్టారు.

ADVERTISEMENT

అయితే వైసీపీ పార్టీ ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ నుంచి ఆ పార్టీ కీలక నేతల వరకు ఎవరు కూడా కేంద్ర బీజేపీ టార్గెట్ గా ఒక్క విమర్శ కూడా చెయ్యలేదు, అలాగే ఎన్డీయే ప్రభుత్వం పై ఒక్క అవినీతి ఆరోపణతో ముందుకు రాలేదు.

అటువంటి వైసీపీ తాజగా బీజేపీ కి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న సీజేపీ కి మద్దతు ప్రకటించింది. అలాగే అటు బిఆర్ఎస్ సైతం సీజేపీ పోరాటానికి తమ పార్టీ తరుపున సంఘీభావం తెలిపింది. అయితే ఈ రెండు పార్టీలు ఇప్పుడు సడన్ గా కాక్రోచ్ల వైపు చూడడానికి ఉన్న రాజకీయ కారణం ఏమిటి అనేది ఇక్కడ చర్చ.

కాంగ్రెస్ తో విభేదించి జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ ని స్థాపించారు, ఇక ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ ని కాదని బిఆర్ఎస్ రాజకీయం మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో ఈ రెండు పార్టీలు కాంగ్రెస్ తో రాజకీయ బంధం పెట్టుకుంటే అది పార్టీ క్యాడర్ లో అసంతృప్తికి దారి తీస్తుంది.

అలాగని ఇటు బీజేపీ తో లోపాయకారి పొత్తుకు సై అందామనుకుంటే ఇరు పార్టీల ఉమ్మడి రాజకీయ శత్రువైన టీడీపీ బీజేపీ పార్టీకి ప్రధాన మిత్రపక్షంగా మారిపోయింది. టీడీపీ ని వద్దనుకుని బీజేపీ వైసీపీ వైపు చూసే ఆస్కారం లేదు, అలాగే టీడీపీ తో అలయన్స్ తో ఉన్న బీజేపీ తో బిఆర్ఎస్ జతకడితే ప్రత్యర్థి పార్టీల రాజకీయ దాడి పెరుగుతుంది.

ఈ నేపథ్యంలో ఈ ఇద్దరికీ ఇప్పుడు నీట్ ఉద్యమంతో దేశ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారిన కాక్రోచ్ జనతా పార్టీ మూడో ప్రత్యామ్నాయం గా కనిపిస్తుందా.? నీట్ ఉద్యమంతో జెన్ జీ లా మద్దతు సాధించిన సీజేపీ సర్ ఉద్యమంతో మరోసారి బీజేపీ పై రాజకీయంగా పై చేయి సాధిస్తే రేపటి రోజున దేశ రాజకీయాలలో సీజేపీ స్థాయి, స్థానం పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.

ఆ కారణమే వైసీపీ, బిఆర్ఎస్ లను కాక్రోచ్లకు దగ్గర చేస్తుందా.? అందుకే ఈ రెండు పార్టీల అధినేతలు ముందుగానే కర్చీఫ్ వేసుకుని తమ స్థానాన్ని రిజర్వ్ చేసుకుంటున్నాయా.? ఒకవేళ రేపటి రోజున వైసీపీ, బిఆర్ఎస్ ఊహలు వాస్తవంలోకి రాకుంటే, మరోమారు కేంద్రంలో మోడీ నాయకత్వంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వస్తే అప్పుడు బీజేపీ మొదలుపెట్టే రాజకీయ దాడిని వైసీపీ, బిఆర్ఎస్ లు తట్టుకుని నిలబడగలవా.?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Recent Posts

Jailer 2 Day 1 BO: Great Start, But Missed Potential?

Rajinikanth's Jailer 2 has taken a strong start at the global box office and is…

27 minutes ago

AP Civic Polls: TDP Gets 11 Corporations, Jana Sena 4, BJP 2

The TDP, Jana Sena and BJP have finalised their seat-sharing agreement for Andhra Pradesh’s urban…

42 minutes ago