365 రోజులలో 341 రోజులు అప్పులే….మరి ఆ 24 డెబిట్ హాలిడేశా..?

బటన్ నొక్కడానికే ముఖ్యమంత్రి పదవి…అప్పు చేయడానికే ప్రభుత్వం అన్నట్టుగా పరిపాలన కొనసాగిస్తున్న ఏపీ ప్రభుత్వం వైసీపీ గత ఆర్థిక సంవత్సరం అప్పుల చిట్టా పొద్దుని ప్రజల ముందు ఉంచింది కాగ్.

జగన్ సర్కార్ ఏడాదిలో ఉన్న 365 రోజులలో దాదాపు 341 రోజులు ఎదో ఒక కారణంతో అప్పు చేస్తూనే వచ్చిందని, సంక్షేమ పథకాల పేరుతో బటన్ నొక్కడానికి ఒకసారి, అభివృద్ధి పేరుతో మరోసారి ఇలా ఒక్కోసారి ఒక్కో కారణంతో అప్పులు చేస్తూ నమ్మి ఓటేసిన ప్రజలను, ప్రజల ఆస్తులను తాకట్టులు పెట్టి అప్పులు తెస్తూనే ఉంది వైసీపీ ప్రభుత్వం అంటూ కాగ్ తన నివేదికలో పొందుపరిచింది.

ADVERTISEMENT

అయితే ఏడాదిలో కేవలం 24 రోజులు మాత్రమే జగన్ సర్కార్ అప్పు చెయ్యలేదు అంటే ఆ 24 రోజులు అప్పు చేసే అవసరం ప్రభుత్వానికి రాలేదా..? లేక అప్పు ఇచ్చే వారు లేరా..? ఇలా ఏడాదికి 24 రోజుల పాటు జగన్ ప్రభుత్వం క్రాప్ హాలిడే, పవర్ హాలిడే మాదిరి డెబిట్ హాలిడే తీసుకుందా..? అంటూ వైసీపీ అప్పుల చిట్టాను , డెబిట్ హాలిడే ను చూసి ఆశ్చర్యపోతున్నారు ప్రజలు.

కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు, రాష్ట్ర నుంచి వచ్చే ఆదాయం సరిపోక కేంద్రంతో పాటు ఇతర సంస్థల నుండి 2022 – 23 మధ్య ఓడీ కింద ఏపీ ప్రభుత్వం అక్షరాలా 57066 కోట్ల రూ.. అప్పులు చేసిందని కాగ్ నివేదిక బయటకొచ్చింది. ఇప్పటికే గత ప్రభుత్వం అమరావతి లో నిర్మించిన ప్రభుత్వ సచివాలయం ను ఒక బ్యాంకుకు తాకట్టు పెట్టి మరికొంత అప్పులు తెచ్చి ఎన్నికల వరకు బటన్ నొక్కడానికి తగిన జాగ్రత్తలు తీసుకున్న జగన్ ప్రభుత్వానికి ఈ కాగ్ నివేదిక మరో ఎదురు దెబ్బ కానుంది.

‘రాష్ట్రనికి ఆదాయం సృష్టించకుండా అప్పులు చేసి, తాకట్లు పెట్టి ఉచిత పథకాల బటన్ నొక్కడం అంటే రాష్ట్ర భవిష్యత్తు గొంతు నొక్కినట్టే’. ఇలా ప్రభుత్వాలు తమ స్వార్ధ ప్రయోజనాల కోసం, తమ పార్టీ ఓటు బ్యాంకు నిలబెట్టుకోవడం కోసం ఉచితాల బటన్ నొక్కుతూ పోతే ఆంధ్రప్రదేశ్ అప్పుల ప్రదేశ్ గా మారడానికి ఎంతో సమయం పట్టకపోవచ్చు.

ఈ బటన్ నొక్కి రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు జగనన్న పెద్ద మేలు చేస్తున్నారు అంటూ సమర్ధించుకుంటున్న ఈ వైసీపీ నాయకులు…ప్రభుత్వం చేస్తున్న అప్పుల గురించి, వాటికీ కడుతున్న వడ్డీల గురించి కూడా ప్రజలకు చెప్పే ధైర్యం చేయగలరా..? బహిరంగ వేదికల మీద చర్చించేంత సాహసం ఉందా..? కనీసం ఎన్నికలకు చివరి నిమిషంలో అయినా ముఖ్యమంత్రి జగన్ ఈ నివేదిక మీద ప్రెస్ మీట్ పెట్టగలరా..?

ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే చాలు అది బాబు స్క్రిప్ట్.., వాళ్ళు బాబు మనుషులు అంటూ ఒక యెల్లో ముద్ర వేయగలిగిన ఈ సోకాల్డ్ వైసీపీ రాజకీయ మేధావులు చివరికి ఒక స్వతంత్ర ప్రతిపత్తిగా తన విధులు నిర్వహిస్తున్నఈ కాగ్ ( కంట్రోల్ అండ్ ఆడిట్ జనరల్ ఆఫ్ ఇండియా) నివేదికను కూడా ను కూడా యెల్లో మీడియా జాబితాలో వేసేస్తారేమో చూడాలి మరి..!

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Big Collections, No Profits? Ugly Truth Behind Box Office

There is a common misconception about movie collection figures. Fans often add GST to box-office…

5 minutes ago

Don’t Sleep Teaser: A Psychological Thriller

  Cinematographer Shamdat is making his Telugu directorial debut with the psychological thriller Don’t Sleep,…

8 minutes ago