
దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడిన దాని మూలాలు ఏపీలో ఉన్నట్లే, ఏపీలో ఏ అవినీతి తీగ లాగినా వైసీపీ డొంక కదులుతుంటుంది.
కాకినాడ సీపోర్టు కబ్జా వ్యవహారం బయటపడినప్పుడు ఎప్పటిలాగే వైసీపీ సొంత మీడియాలో దానిని ఖండిస్తూ పుంఖానుపుంకాలుగా కధనాలు ప్రచురించి, చివరికి ఇది కూడా ‘చంద్రబాబు నాయుడి కుట్రే’ అని తేల్చి చెప్పేసి ఈ కేసులో సూత్రధారులైన వైసీపీ నేతలందరికీ క్లీన్ సర్టిఫికెట్ ఇచ్చేసింది.
ఇలా ఎవరికి వారు సొంత మీడియా ఏర్పాటు చేసుకొని, దానిలో తమకు అనుకూలంగా చెప్పేసుకునే తీర్పులకు రాజ్యాంగంలో చట్టబద్దత కల్పిస్తే న్యాయస్థానాలకు ఇంత పని ఉండదు కదా?
కాకినాడ సీపోర్టు యాజమాన్యాన్ని బెదిరించి, భయపెట్టి వైసీపీ నేతలు బలవంతంగా వాటాలు వ్రాయించేసుకోవడంపై ఏసీబీ విచారణ మొదలుపెట్టింది. ఇదీ ‘రాజకీయ కక్ష సాధింపు కోసమే’ అనే రెడీమేడ్ సమాధానం వైసీపీ వద్ద సిద్దంగానే ఉంది.
కానీ ఈ కేసులో ఈడీ కూడా జోక్యం చేసుకొని మనీలాండరింగ్ కేసు నమోదు చేసి నోటీసులు పంపిస్తుండటంతో వైసీపీ సొంత మీడియా మళ్ళీ చొరవ తీసుకొని, మరో కొత్త స్టోరీ అల్లేసి ముందుగా వారందరికీ క్లీన్ చిట్ ఇచ్చేసి, ఈడీ దర్యాప్తుని కూడా రాజకీయ కోణంలో చూపించకమానదు.
అయితే దాని స్టోరీలతో ఏసీబీ దర్యాప్తు ఆగదు… ఈడీ దర్యాప్తు కూడా ఆగదని తెలుసు. కానీ ఈ స్టోరీలతో కనీసం పోర్టులో అంటుకున్న బురద.. బురద కాదని జనాలని నమ్మించేందుకు ఉపయోగపడవచ్చు.
ఈడీ రంగంలోకి దిగి వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి, ఎంపీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డికి, అరబిందో అధినేత శరత్ చంద్రారెడ్డికి, ఈ కబ్జా వ్యవహారమంతా చట్టబద్దంగానే జరిగిందని చూపించిన పీకేఎఫ్ శ్రీధర్ అండ్ సంతానం ఎల్ఎల్‌పీ తడితరులకు వరుసగా నోటీసులు పంపిస్తోంది. అప్పుడు ఒక్కొక్కరూ ఒక్కో కుంటి సాకు చెప్పి రాకుండా తప్పించుకున్నారు.
అయితే ఈడీ కేసు నమోదు చేసినంత మాత్రాన్న వైసీపీ నేతలు భయంతో గజగజా వణికిపోతారా? అంటే కాదనే చెప్పొచ్చు. ఆక్రమాస్తుల కేసులో ఈడీతో 14 ఏళ్ళుగా ఫుట్ బాల్ ఆడుకుంటున్నప్పుడు, కాకినాడ పోర్టులో ఆడుకోలేరా?
ఇక్కడ గమనించాల్సిన మరో ముఖ్య విషయం కూడా ఉంది. ఇంతవరకు సీబీఐ, ఈడీలు దేశవ్యాప్తంగా వివిద నాయకులపై నమోదు చేసిన కేసులలో ఎంత మందిని దోషులుగా నిరూపించగలిగాయి? వారిలో ఎంతమందికి శిక్షలు పడేలా చేయగలిగాయి?
ఎంత మంది నుంచి ఎంత సొమ్ము రికవరీ చేయగలిగింది?ఎన్ని కేసుల విచారణ పూర్తి చేయగలిగింది? అంటే సమాధానం అందరికీ తెలుసు.
పైగా ఈడీ అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన అర్వింద్ క్రేజీవాల్, కల్వకుంట్ల కవిత వంటివారు బెయిల్‌పై బయటకు వచ్చేసినప్పుడు ‘న్యాయం ధర్మం గెలిచిందని’ ఈడీ సీబీలని వెక్కిరిస్తున్నారు కూడా.
ఇంత గొప్ప ట్రాక్ రికార్డ్ కలిగిన ఈడీ, కాకినాడ సీపోర్టు కేసుని కూడా బహుశః ఇలాగే ముగించవచ్చు. అది అటకెక్కించబోయే కేసులలో ఇది కూడా ఒకటి కావచ్చు. అందుకే సీబీఐ, ఈడీలంటే వైసీపీ నాయకులకు భయమే లేదు. కానీ అందుకు వారిని తప్పు పట్టాల్సిన అవసరం లేదు.
India beat West Indies by 14 runs in the third T20I at the Holkar Stadium…
Rajinikanth's highly anticipated sequel Jailer 2 directed by Nelson Dilipkumar is all set to hit…