చంద్రబాబు చేయలేని పని జగన్‌ చేయగలరా?

జగన్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ ఏడాది మే నుంచి జూలై వరకు మూడు నెలలకు ఓట్ ఆన్‌ అకౌంట్ బడ్జెట్‌ ప్రవేశపెట్టింది. దాని గడువు బుధవారంతో ముగిసింది. కనుక టిడిపి కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టాల్సి ఉంది.

ADVERTISEMENT

కానీ జగన్‌ ప్రభుత్వం ఆర్ధిక వ్యవస్థని అస్తవ్యస్తం చేయడంతో ఆ లెక్కలన్నీ సరిచూసుకున్నాక అక్టోబర్ లేదా నవంబర్ నెలలో పూర్తి స్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టాలని సిఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించారు.

కనుక అంతవరకు ప్రభుత్వం నిర్వహణ కొరకు రూ.1,29,972.97 కోట్లతో ఓట్ ఆన్‌ అకౌంట్ బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోదం తీసుకొని మంగళవారమే గవర్నర్‌ ఆమోదం కోసం పంపారు. గవర్నర్‌ ఆర్డినెన్స్ జారీ చేస్తే అది తక్షణం అమలులోకి వస్తుంది. ఒకే ఏడాదిలో రెండు ప్రభుత్వాలు ఓట్ ఆన్‌ అకౌంట్ బడ్జెట్‌ విశేషమే.

టిడిపి కూటమి ప్రభుత్వం గవర్నర్‌కు పంపిన ఓట్ ఆన్‌ అకౌంట్ బడ్జెట్‌లో సంక్షేమశాఖలకు రూ.15,140 కోట్లు, సాగునీటి రంగానికి: రూ.13,308.50 కోట్లు, పంచాయితీరాజ్ శాఖకు: రూ.1,549.27 కోట్లు, వైద్య ఆరోగ్య శాఖకు రూ.1,198 కోట్లు కేటాయించిన్నట్లు సమాచారం.

చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టకపోవడాన్ని వైసీపి తప్పు పడుతోంది. ఎన్నికల హామీలు అమలుచేయకుండా తప్పించుకునేందుకే సిఎం చంద్రబాబు నాయుడు ఓట్ ఆన్‌ అకౌంట్ బడ్జెట్‌ పెడుతున్నారని, అదే… జగన్‌ ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టి సంక్షేమ పధకాలకు టంచన్‌గా నిధులు విడుదల చేస్తుండేవారని సోషల్ మీడియాలో వైసీపి డబ్బా కొట్టుకుంటోంది.

జగన్‌ రాష్ట్ర ఖజానాని ఖాళీ చేయడమే కాక తాము చేసిన అప్పులు, వడ్డీల భారం కూడా సిఎం చంద్రబాబు నాయుడుపై పెట్టి పోయారు. కనుకనే ఓట్ ఆన్‌ అకౌంట్ బడ్జెట్‌ ప్రవేశపెట్టవలసి వస్తోంది.

కానీ 40 ఏళ్ళ రాజకీయ, పరిపాలన అనుభవం ఉన్న సిఎం చంద్రబాబు నాయుడు చేయలేని పని జగన్‌ ఎలా చేయగలరు?అంటే మసిపూసి మారేడుకాయ చేసిన్నట్లుగా ప్రజలను మభ్యపెట్టేందుకు కాకి లెక్కలతో బడ్జెట్‌ తయారు చేసి సమర్పించి ఉండేవారు.

జగన్‌ ప్రభుత్వం గత బడ్జెట్‌లో వివిద శాఖలకు ఘనంగా కేటాయింపులు చేసింది కానీ నిధులు విడుదల చేయలేదు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణకి, అభివృద్ధి పనులకు, చివరికి రోడ్ల మరమత్తులకు కూడా నిధులు విడుదల చేయలేదని ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యేలే చెప్పుకున్నారు.

వచ్చిన ఆదాయం అంతా వైసీపి రంగులకి, పధకాల ప్రచారానికి, కోర్టు కేసులు వంటి అనవసర ఖర్చులకే సరిపోయేది. అందుకే నెలనెలా ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితి ఏర్పడింది. కానీ తమ ప్రభుత్వ వైఫల్యాలు మరిచిపోయి, సిఎం చంద్రబాబు నాయుడుని విమర్శిస్తుండటం సిగ్గుచేటు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Recent Posts

Mrunal Thakur Says No, But What Is She Waiting For?

Mrunal Thakur has not signed a new film in nearly nine months. However, it is…

19 minutes ago

Rohit Back as MI Cap? Truth Behind Big Rumours

Mumbai Indians have reportedly shut down rumours of Rohit Sharma returning as captain for IPL…

50 minutes ago