
మద్యం కుంభకోణంపై విచారణ ముందుకు సాగుతున్నకొద్దీ జగన్ ప్రభుత్వం ఎంత పకడ్బందీగా ప్లాన్ చేసి దోచుకుందో తెలుసుకొని సామాన్య ప్రజలు నివ్వెరపోతున్నారు.
అక్రమాస్తుల కేసులలో జగన్ 16 నెలలు చంచల్‌గూడా జైలులో గడిపి బెయిల్‌పై బయటకు వచ్చినా, ఆయన అమాయక మొహాన్ని చూసి నమ్మి అధికారం కట్టబెడితే, ఈవిదంగా తమని మోసగించారని ఆంధ్ర ప్రజలు బాధ పడుతున్నారు.
తెలంగాణలో కూడా మాజీ సిఎం కేసీఆర్ అభివృద్ధి పేరు చెప్పి వేలకోట్లు దోచుకున్నారని కాంగ్రెస్ మంత్రులు ఆరోపిస్తున్నారు. అందుకు కాళేశ్వరం ప్రాజెక్టు, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, ఎఫ్-1 రేసింగ్ మొదలైనవి నిదర్శనాలుగా చూపుతున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాలలో సాగుతున్న విచారణలలో సూత్రధారులు జగన్, కేసీఆర్, వారి మంత్రులు, ఎమ్మెల్యేలే అని చూచాయగా తెలుస్తూనే ఉంది.
కానీ ఈ కమీషన్లు, విచారణలలో బయటపడుతున్న సాక్ష్యాధారాలతో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు వారిపై కేసులు నమోదు చేయగలవా? నోటీసులు పంపించగలవా? విచారణకు రప్పించగలవా?అంటే అనుమానమే.
ఫోన్ ట్యాపింగ్, ఎఫ్-1 రేసింగ్ కేసులో కేసీఆర్, కేటీఆర్‌లని అరెస్ట్ చేయకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పుకుంటున్న సంగతి తెలిసిందే.
కనుక జస్టిస్ పీసీ ఘోష్ కమీషన్ కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందని నివేదిక ఇచ్చినప్పటికీ కేసీఆర్, హరీష్ రావు తదితరులపై చర్యలు తీసుకోగలదా? అంటే కాదనే భావించాల్సి ఉంటుంది.
సిఎం రేవంత్ రెడ్డి చేతులు కట్టేసిన్నట్లు పరిస్థితులు ఉన్నందున కేసీఆర్‌పై ఎటువంటి చర్యలు తీసుకోలేకపోవచ్చు. కానీ జగన్‌కు వ్యతిరేకంగా ప్రాధమిక సాక్ష్యాధారాలు లభిస్తే, ఆయనపై కేసు నమోదు చేసేందుకు ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు వెనకాడవలసిన అవసరం లేదు… ఒకవేళ కేంద్రం ఆయనని అరెస్ట్ చేయకుండా కాపాడాలని అనుకుంటే తప్ప!
ప్రస్తుతం రాష్ట్రంలో, కేంద్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వాలే ఉన్నాయి. ఏపీ అభివృద్ధి కోసం సిఎం చంద్రబాబు నాయుడు కేంద్రంపై ఆధారపడుతుండగా, మోడీ ప్రభుత్వానికి టీడీపీ మద్దతు చాలా కీలకంగా ఉంది. పరస్పర అవసరం ఎంతైనా ఉంది కనుక మద్యం కుంభకోణంలో జగన్‌ని కాపాడేందుకు కేంద్రం ప్రయత్నించకపోవచ్చు.
మద్యం కుంభకోణంలో వేల కోట్ల అవినీతి జరిగినట్లు విచారణలో బయటపడింది. కనుక రాష్ట్ర ప్రభుత్వం సూచన మేరకు కేంద్రం ఈడీ విచారణకు ఆదేశించినా ఆశ్చర్యం లేదు. కానీ ఈడీ రంగంలో దిగకపోతే కేంద్రం దానికి బ్రేకులు వేస్తోందని అనుమానించాల్సి ఉంటుంది.
జగన్ తలుచుకున్నదే తడువు చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసినట్లు, చంద్రబాబు నాయుడు కూడా జగన్‌ని అరెస్ట్ చేయించగలరా?అంటే అవుననే చెప్పుకోవాలి.
కానీ చంద్రబాబు నాయుడు జగన్‌లాగ దుందుడుకుగా వ్యవహరించే రాజకీయ నాయకుడు కారు. అందుకే “ఎవరిపై ఎప్పుడు చర్యలు తీసుకోవాలో నాకు బాగా తెలుసు,” అని సిఎం చంద్రబాబు నాయుడు ఇటీవలే అన్నారు.
ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఇద్దరిలో మరో కామన్ విషయం ఏమిటంటే ఇద్దరూ జగన్, కేసీఆర్‌లతో జైలు లెక్కలు సరిచేసుకోవాల్సి ఉంది. ఇప్పటికిప్పుడు ఆ లెక్కలు సరిచేయలేనప్పటికీ రాబోయే రోజుల్లో తప్పకుండా చేస్తారని ఖచ్చితంగా చెప్పవచ్చు. కానీ ఆ రోజు ఎప్పుడనేది ఎవరికీ తెలియదు.
The Kollywood film Mandaadi starring Soori and Suhas in lead roles and directed by Mathimaran…
Victory Venkatesh, Nandamuri Kalyanram are coming together for the first time in the direction of…