
ఏపీ డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌పై గన్నవరం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. సుగాలి ప్రీతి తల్లి పార్వతి పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు తన కూతురుకి న్యాయం జరిగేవరకు పోరాడుతామని ప్రకటించారు. కానీ అధికారంలోకి వచ్చాక ఆ కేసుని నీరు గార్చేలా మాట్లాడుతున్నారని పార్వతి పిర్యాదు చేశారు. కనుక అయనపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆమె పోలీసులకు పిర్యాదు చేశారు.
ముందుగా సుగాలి ప్రీతి కేసు వివరాలు క్లుప్తంగా.. కర్నూలు నగర శివార్లలో గల కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ స్కూల్ హాస్టల్లో పదో తరగతి విద్యార్థిని సుగాలి ప్రీతి (14) సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ శవమై కనిపించింది. ఈ ఘటన 2017 ఆగస్టు 19న జరిగింది.
ప్రీతి శరీరంపై గాయాలు ఉన్నాయని ఆమె తల్లిదండ్రులు సుగాలి పార్వతి, రాజు నాయక్ ఆరోపించారు. స్కూల్ కరస్పాండెంట్, అతని కుమారులు తమ కుమార్తెపై అత్యాచారం చేసి, ఆపై హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని వారు ఫిర్యాదు చేశారు.
వారి పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ స్కూల్ కరస్పాండెంట్ వి. జనార్ధన్ రెడ్డి, ఇద్దరు కుమారులు దివాకర్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డిలని అరెస్ట్ చేశారు. కానీ కేవలం 8 రోజుల్లోనే వారు ముగ్గురూ బెయిల్‌పై విడుదలయ్యారు. అప్పటి నుంచి ఈ కేసుపై అధికార, విపక్షాల రాజకీయాలు సాగుతూనే ఉన్నాయి.
ఇప్పుడు వర్తమానానికి వస్తే, ఓ బాధితురాలు డెప్యూటీ సిఎం మీద పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చేస్తే దాని ఆధారంగా పోలీసులు ఆయనపై కేసు నమోదు చేయడం ప్రజాస్వామ్యానికి నిదర్శనంగా చూడవచ్చు.
కానీ ఆమె నిందితులకు బదులు తన కుమార్తెకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చి భిన్నంగా వ్యవహరిస్తున్నందుకు పవన్ కళ్యాణ్‌పై పిర్యాదు చేయడం చూస్తున్నప్పుడు ఇది రాజకీయ ప్రేరితమనే అనుమానం కలుగుతోంది.
ఒకవేళ ఆమె పిర్యాదు సహేతుకమే అనుకుంటే, గతంలో ఇదేవిధంగా వ్యవహరించిన విపక్ష పార్టీ అధినేతపై కూడా పిర్యాదు చేయాలి కదా?
కానీ సుగాలి ప్రీతీ తల్లి పార్వతి ఈ కేసుతో సంబంధం లేని పవన్ కళ్యాణ్‌పై పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చేసినందున ఇది రాజకీయ ప్రేరితమైనదే అనే భావన కలిగిస్తోంది.
చనిపోయిన కూతురుకి న్యాయం కోసం పోరాడాల్సిన పార్వతి, ఈవిధంగా రాజకీయ చదరంగంలో పావుగా మారితే చివరికి నష్టపోయేది తానేనని గ్రహిస్తే మంచిది.
Vijay Deverakonda’s Ranabaali is heading towards release with a big overseas target, but the early…
After missing its October 9 release, Venkatesh and Trivikram’s Aadarsha Kutumbam AK47 was reportedly heading…