
సలార్, కాంతార, దేవర, పుష్ప … ఇలా ఇప్పుడు ప్రతీ సినిమాకి సీక్వెల్ వస్తున్నాయి. అలాగే రాజకీయాలలో కూడా సీక్వెల్స్ వస్తున్నాయి. టిడిపి 1.0కి సీక్వెల్‌గా టిడిపి 2.0 ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మరి అటువంటప్పుడు జగన్ హయాంలో కేసులకి కూడా సీక్వెల్ ఉండటం కూడా సహజమే కదా?
మంత్రి నారా లోకేష్ రెడ్‌బుక్‌తో అది మొదలైంది. దానిలో మొదటి అధ్యాయం ప్రారంభం అయ్యిందని, రెండో అధ్యాయం కోసం గుడివాడ టిడిపి నేతలు చొరవ తీసుకోవలసి ఉంటుందని మంత్రి నారా లోకేష్ హింట్ ఇచ్చారు.
దానిని వారు క్యాచ్ చేసి ఇంకా చొరవ తీసుకున్నారో లేదో తెలీదు కానీ విశాఖలో ఓ యువతి క్యాచ్ చేసి గుడివాడ మాజీ వైసీపి ఎమ్మెల్యే కొడాలి నానిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఏయూ న్యాయకళాశాల విద్యార్ధిని అంజనీ ప్రియ శనివారం రాత్రి విశాఖలో మూడో పట్టణ పోలీస్ స్టేషన్‌లో కొడాలి నానిపై ఫిర్యాదు చేసింది.
కొడాలి నాని ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నిత్యం చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ గురించి చాలా అవహేళనగా, అనుచితంగా మాట్లాడేవారని, ఓ మహిళగా అది తనను చాలా బాధించిందని కనుక ఆయనపై ఇప్పుడు ఫిర్యాదు చేస్తున్నానని చెప్పారు. ఆమె పిర్యాదుని స్వీకరించి కొడాలి నానిపై కేసు నమోదు చేశామని సీఐ రమణయ్య తెలిపారు.
ఆ యువతి ఫిర్యాదు చేయడం ఓ సాధారణ వార్తలాగే అనిపిస్తుంది. కానీ రెడ్‌బుక్‌లో రెండో అధ్యాయం ప్రారంభం అయ్యిందని అది సూచిస్తున్నట్లే భావించవచ్చు. కనుక త్వరలోనే రాష్ట్రంలో మరికొన్ని జిల్లాలు, పట్టణాలలో కొడాలి నానిపై కేసులు నమోదు కావడం తధ్యమే. అయితే ఎప్పుడు? అంటే దానికి కొడాలి నానియే ముహూర్తం పెట్టుకుంటారు.
తనపై విశాఖలో కేసు నమోదు అయ్యిందనే విషయం ఈపాటికి కొడాలి నానికి తెలిసే ఉంటుంది. కనుక నేడో రేపో ఆయన మీడియా ముందుకు వచ్చి ఆవేశంతో సిఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ గురించి ఏదేదో మాట్లాడి తనపై రెండో కేసుకి ఆయనే ముహూర్తం పెట్టుకుంటారు.
జగన్మోహన్ రెడ్డి, వైసీపి నేతలు చంద్రబాబు నాయుడి ప్రభుత్వానికి కనీసం ఆరు నెలలు కూడా సమయం ఇవ్వకుండానే మొదటి నెల నుంచే ఎదురుదాడి మొదలుపెట్టేశారు.
కానీ కూటమి ప్రభుత్వం మాత్రం కొడాలి నానితో సహా పలువురు ముఖ్య నేతలకు 5 నెలలు బఫర్ టైమ్ ఇచ్చి, అప్పటికీ మారనందుకే ఈ రెండో అధ్యాయం ప్రారంభిస్తోంది.
పుష్ప కంటే పుష్ప-2 ఇంకా గొప్పగా అద్భుతంగా ఉంటుందని అందరూ చెప్పుకుంటున్నారు. రెడ్‌బుక్ రెండో అధ్యాయంలో కొడాలి నాని, మాజీ మంత్రి రోజావంటి హేమాహేమీలు ఉండే అవకాశం ఉంటుంది కనుక మొదటి అధ్యాయం కంటే రెండో అధ్యాయమే రాష్ట్ర రాజకీయాలలో కాక పుట్టించవచ్చు.
A Reddit post has gone viral for claiming that the cybersecurity firm Fortinet has laid…
An Indian F-1 student finds herself in serious trouble. A misunderstanding at Walmart has left…