Telugu

కేసులు, అరెస్టు, బెయిల్‌.. ఏ కేసు చూసినా ఇంతేగా!

పువ్వుల నుంచి తేనె దొంగతనం చేసి తేనెటీగలు గూడు కట్టుకున్నట్లుగా, వైసీపీలో దాదాపు ప్రతీ ఒక్కరూ ఏదో అవినీతి, అక్రమాలు, కబ్జాలకు పాల్పడి సంపద పోగేసుకున్నారు.

ఓ మంత్రిగారి గోదాములో తెల్ల రేషన్ కార్డులు బియ్యం మాయం అయిపోతే, మరో మంత్రిగారు ఇలాకాలో అటవీ భూములు మాయం అయిపోతాయి.

ADVERTISEMENT

ఇంతకీ విషయం ఏమిటంటే, ఇటువంటి ఘనమైన చరిత్ర కలిగిన ఆ మాజీ మంత్రులలో విడదల రజనీ కూడా ఒకరు. ఆమె 2020లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే పల్నాడు జిల్లా యడ్లపాడులో శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యాజమానులను బెదిరించి రూ.2.20 కోట్లు వసూలు చేశారు.

ఆ కలెక్షన్స్‌, వాటిలో వాటాల పంపకాల గురించి ఇప్పటికే పత్రికలో వివరాలు వచ్చాయి కనుక ఇప్పుడు ఆ చర్చ అనవసరం.

వైసీపీలో ఎప్పటికప్పుడు బయటపడుతున్న ఈ భాగోతాలు చూస్తున్నప్పుడు, ఒకవేళ వైసీపీ మరో 5 ఏళ్ళు అధికారంలో ఉండి ఉంటే ఏమయ్యేది? మళ్ళీ జగన్‌ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం పరిస్థితి ఏమిటి? సరే! వైసీపీలో అవినీతిపరులను కూటమి ప్రభుత్వం పట్టుకొని ఏం చేయగలుగుతోంది? అనే సందేహాలు కలుగుతాయి.

ఇప్పటికే జోగి రమేష్, పోసాని, వంశీలతో సహా ఓ అరడజను మందిపై కేసులు వేసింది. కొందరు లోపలకు వెళ్ళి బయటకు వస్తున్నారు.

కనుక ఈ పల్నాడు అవినీతి క్రషర్ ఎపిసోడ్ నోటీసుతో మొదలేయి విచారణ, ముందస్తు బెయిల్‌ పీటిషన్‌, అరెస్టు, బెయిల్‌పై విడుదలతో పూర్తవుతుంది.

పోనీ.. ఈ కేసులతో వైసీపీ నేతలెవరైనా భయపడుతున్నారా?కనీసం భయపెట్టగలిగిందా?అంటే వైసీపీ నేహాలు ‘తగ్గేదేలే’ అంటున్నారుగా?

పోనీ.. వైసీపీ నేతల చేతుల్లో వేధింపులకు గురైన టీడీపీ కార్యకర్తలనైనా ఈ కేసులతో సంతోషపెట్టగలిగిందా?అంటే లేదని వారే చెపుతున్నారుగా?

కనుక కొండను తవ్వి ఎలుకని కూడా పట్టుకోలేకపోతున్నప్పుడు, ‘మనం ఏవిదంగా ముందుకు సాగుతున్నామని’ ఆలోచించుకోవలసింది కూటమి ప్రభుత్వమే.. కేసులతో సానుభూతి పొందుతున్న వైసీపీ కాదు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Reporting Live: Netflix Disappoints Despite Powerful Story

Parineeti Chopra’s latest Netflix film, Reporting Live, is out and the responses that it has…

23 minutes ago

ఆంక్షల వలయంలో హస్తిన….

నాటి సీజేపీ నీట్ ఉద్యమం తాలూకా పరిణామాలను చూసిన ఉన్నతాధికారులు, కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ముందుగానే ఎలర్ట్ అవుతున్నారు. భారత…

48 minutes ago