
చెడపకురా చెడేవు… అనేది పాత నానుడి. ‘కెలకురా… కేసుల్లో చిక్కుకుంటావు..’ అనేది కొత్త నానుడిగా చెప్పుకోవచ్చు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో సహా ఆ పార్టీ నేతలందరూ ఇదే తప్పు చేస్తూ కేసుల్లో చిక్కుకుంటున్నారు. ఇందుకు తాజా ఉదాహరణగా సుగాలి ప్రీతి కేసు గురించి చెప్పుకోవచ్చు.
కర్నూలులోని కట్టమంచి రామలింగా రెడ్డి పాఠశాలలో పదో తరగతి విద్యార్ధిని సుగాలి ప్రీతి. ఆమె పక్కనే ఉన్న హాస్టల్లో ఉంటూ చదువుకునేది. పాఠశాల యాజమాన్యం ప్రతినిధులైన కె. జనార్ధన్ రెడ్డి, కె. హర్షవర్ధన్ రెడ్డి, కె.దివాకర్ రెడ్డి మరికొందరు కలిసి ఆమెని వేధించి, హత్య చేశారని కానీ ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించేందుకు ఆమె మృతదేహాన్ని హాస్టల్లో ఫ్యానుకి వ్రేలాడదీసినట్లు 2017, ఆగస్ట్ 19న కర్నూలు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
అన్నెం పున్నెం తెలీని ఓ బాలికకి ఇంత అన్యాయం జరిగితే దానిని ‘సుగాలి ప్రీతి కేసు’ అని చెప్పుకోవడం చాలా బాధాకరమే. కానీ జగన్ హయంలో జరిగిన ఇటువంటి అనేక దారుణాల మాదిరిగానే ఇది కూడా చివరికి ఓ ‘కేసు’గా మిగిలిపోయింది.
మొదట పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో సహా పలు తీవ్రమైన సెక్షన్స్ కింద ఈ కేసు నమోదు చేశారు. కానీ నిందితులని తప్పించేందుకు సెక్షన్స్ మారాయి… కేసు స్వరూపం మారింది. అప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పూనుకొని సుగాలి ప్రీతీకి న్యాయం చేసేందుకు చాలా పోరాడటంతో జగన్ ప్రభుత్వంలో కదలిక వచ్చింది. ఈ కేసుని సీబీఐకి అప్పగిస్తున్నట్లు జీవో జారీ చేశారు. కానీ అంతటితో దానిని పక్కన పడేశారు.
జగన్ పల్నాడు పర్యటనలో అయన కారు కింద సింగయ్య అనే వైసీపీ కార్యకర్త పడి చనిపోయినప్పుడు, అయన భార్య, కుటుంబ సభ్యులను తాడేపల్లి ప్యాలస్‌కి రప్పించుకొని వారి చేత కూటమి ప్రభుత్వంపై ఏవిదంగా ఆరోపణలు చేయించారో, ఇప్పుడు సుగాలి ప్రీతీ కేసులో కూడా అదే విదంగా చేయిస్తున్నారు. వైసీపీ నేతలు కూడా పదేపదే డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌ని టార్గెట్ చేసుకొని విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు.
వారి ఆరోపణలపై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ తన పోరాటాల వలన ఆమె తల్లితండ్రులకు ఏవిదంగా లబ్ది పొందారో వివరించారు. అయినా వైసీపీ మూకలు రేచ్చిపోతూనే ఉన్నాయి. దీంతో వారికి సిఎం చంద్రబాబు నాయుడు ఊహించని పెద్ద షాక్ ఇచ్చారు. ఈ కేసు విచారణని సీబీఐకి అప్పగించాబోతున్నట్లు ప్రకటించారు.
అమాయక బాలిక సుగాలి ప్రీతికి జరిగిన అన్యాయానికి మానవతా దృక్పదంతో స్పందించాల్సిన వైసీపీ, ఆమె కేసుతో శవరాజకీయాలు చేస్తుండటం చాలా బాధాకరం. ఈ కేసు విచారణ సీబీఐకి అప్పగించడంతో ఇప్పుడు వైసీపీకే ఎదురు దెబ్బ తగిలింది. ఈ కేసులో వైసీపీ నేతలు కూడా ఉన్నారా లేదా? లేకపోతే నిందితులను తప్పించేందుకు వైసీపీలో ఎవరెవరు తోడ్పడ్డారో సీబీఐ విచారణలో తప్పక బయటపడుతుంది. అందుకే ‘కెలకురా… కేసుల్లో చిక్కుకుంటావు..’ అనుకోవలసి ఉంటుంది.
Fauzi is now reportedly targeting a March 18, 2027 release. The film was originally scheduled…
The bodycam footage of an arrest has gone viral on Instagram. The footage shows police…