
వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తు పూర్తయిందని సీబీఐ సుప్రీంకోర్టుకి తెలియజేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డితో సహా ఈ కేసుతో సంబంధం ఉన్న వైసీపీ నేతలందరి బెయిల్ రద్దు చేయాలని విజ్ఞప్తి చేసింది.
కనుక వివేకా కుమార్తె, అల్లుడు సునీతా రెడ్డి, రాజశేఖర్ రెడ్డి నేడు కడప వచ్చి ఎస్పీ అశోక్ కుమార్‌ని కలిసి సుప్రీంకోర్టులో ఈ కేసు పురోగతి గురించి వివరించి, నిందితులపై తక్షణం చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ సందర్భంగా ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. “నేను న్యాయపోరాటం చేయాలన్నా సెక్యూరిటీ పెట్టుకొని తిరగాల్సి వస్తోంది. నాడు మా తండ్రి దారుణంగా హత్య చేసిన తర్వాత పోలీసులను బెదిరించి సాక్ష్యాధారాలన్నీ తుడిచేశారు. తర్వాత ఓ లేఖ తెచ్చి ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి, సతీష్ రెడ్డి ముగ్గురూ కలిసి మా నాన్నగారిని హత్య చేశారని ఓ లేఖ వ్రాసుకొచ్చారు.
దానిపై నన్ను సంతకం చేయమంటే నిరాకరించాను. నాడు అవినాష్ రెడ్డి అనుచరులే బెదిరించారు. ఇప్పుడు పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలలో కూడా ఆయన అనుచరులు చేస్తున్న దౌర్జన్యాలు చూస్తుంటే నాడు మా తండ్రిని చంపినప్పుడు కూడా ఇలాగే చేశారు కదా? అని అనిపించింది,” అని అన్నారు.
సునీతా రెడ్డి తనకు ప్రాణహాని ఉందని ఇది వరకే చెప్పారు. ఇప్పుడు మరోసారి చెప్పారు. వివేకాని హత్య చేసినవారికి ఆయన కుమార్తె సునీతా రెడ్డిని హత్య చేయడం పెద్ద కష్టం కాదు. కనుక ఆమెకు ప్రాణహాని కలుగకుండా పోలీసులు భద్రత కల్పిస్తూనే, ఈ కేసులో సాక్షులను, బాధితులను కూడా లేపేసేందుకు ప్రయత్నిస్తున్న వారందరి బెయిల్ రద్దుచేయడం చాలా మంచిది. లేకుంటే మరో హత్య జరిగితే అది ఈ కేసు విచారణనే తారుమారు చేసేయవచ్చు.
Fauzi is now reportedly targeting a March 18, 2027 release. The film was originally scheduled…
The bodycam footage of an arrest has gone viral on Instagram. The footage shows police…