Telugu

ఒక్కరి కోసమే వేట…ఆ ఒక్కరేవరు.?

తెలంగాణలో టీడీపీ పరిస్థితి చూస్తుంటే ముందు నుయ్యి వెనుక గొయ్యి చందంగా మారింది. టి. టీడీపీ కి అభిమాన బలం మెండుగా ఉన్నా, రాజకీయ భవిష్యత్ స్పష్టంగా కనిపిస్తున్నా నాయకత్వ లోపం పార్టీని ముందుకు తీసుకెళ్లలేకపోతుంది.

లోపాన్ని సరిచేసి పటిష్టమైన నాయకత్వాన్ని శోధించడానికి చంద్రబాబుకు కావాల్సినంత సమయం లేకపోవడం ఒక సమస్యగా ఉంటే ఇక్కడ పార్టీ బలోపేతం మీద ద్రుష్టి పెడితే ఏపీలో పార్టీ భవిష్యత్ దెబ్బ తినే అవకాశం ఉండడం మరో అడ్డంకిగా మారింది.

ADVERTISEMENT

టి. టీడీపీ బలోపేతానికి బాబు వేసే ఒక్కో అడుగు టీడీపీ పార్టీకి మరో కొత్త శత్రువుని సృష్టించినట్టే అవుతుంది. 2018 తెలంగాణ ఎన్నికలలో పోటీకి సై అన్న టి.టీడీపీ, బిఆర్ఎస్ కి ప్రత్యర్థిగా మారి కేసీఆర్ ను శత్రువును చేసుకుంది. దాని ఫలితం 2019 ఏపీ ఎన్నికల మీద ప్రభావం పడి వైసీపీ విజయానికి దోహదపడింది.

ఇపుడు కూడా తెలంగాణలో టీడీపీ బలోపేతానికి బాబు వెనుకడుగు వేయడానికి ఇదే కారణం కావచ్చు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి బాబు కి వ్యక్తిగతంగా మంచి సంబంధాలు ఉన్నాయి. అలాగే కాంగ్రెస్ పార్టీ తో కూడా బాబు కి కొత్త శత్రుత్వం లేదు.

ఇటువంటి పరిస్థితులలో తెలంగాణలో టీడీపీ బలోపేతానికి బాబు పావులు కదిపితే అటు కాంగ్రెస్ పార్టీకి ప్రత్యర్థిగా, రేవంత్ రెడ్డికి శత్రువుగా మారక తప్పదు. అసలే జగన్ ఇప్పుడు ఇండియా కూటమికి దగ్గరవడానికి తెరవెనుక రాజకీయం జరుపుతున్నట్టు వార్తలు ప్రచారంలో ఉన్నాయి.

ఇటువంటి సందర్భంలో బాబు అడుగు ముందుకు వేయాలంటే ఆచి తూచి ఆలోచించాలి. లేకపోతే అక్కడి ప్రభుత్వ పెద్దలకు తానూ శత్రువవ్వడమే కాకుండా తన ప్రత్యర్థి జగన్ ను మిత్రుడిని చేస్తున్నాడు. అలాగే తెలంగాణలో టి. టీడీపీ పూర్తిగా కనుమరుగు కావడం, 2023 ఎన్నికల్లో బిఆర్ఎస్ ఓడిపోవడంతో బీజేపీ తన బలాన్ని పెంచుకుంటుంది.

ఈ తరుణంలో టి. టీడీపీ తెలంగాణలో మళ్ళీ యాక్టీవ్ అయితే దాని ప్రభావం టి.బీజేపీ మీద ఖచ్చితంగా పడుతుంది. ఇది బీజేపీ బలోపేతాన్ని దెబ్బతీసినట్లే అవుతుంది. దీనితో ఏపీలో మిత్రపక్షంలో ఉన్నా బీజేపీ తెలంగాణలో ప్రత్యర్థి పక్షానికి చేరుతుంది. ఇది తెలంగాణలో బిఆర్ఎస్ కి ఏపీలో వైసీపీ కి బలంగా మారే అవకాశం లేకపోలేదు.

ఇలా టి.టీడీపీ ఒక్క అడుగు ముందుకు వెయ్యడానికి ప్రయత్నిస్తే పదడుగులు వెనక్కి లాగుతున్న శక్తులే ఎక్కువగా పని చేస్తున్నాయి. ఇటువంటి క్లిష్ట సమయంలో, పార్టీల మధ్య సానుకూలత లేని సందర్భంలో పార్టీని ముందుకు తీసుకువెళ్లగలిగే ఆ ఒక్క వెలుగు కోసం బాబు ఎదురు చూస్తున్నారు.

ఆ వెలుగు నారా లోకేషా, నారా బ్రాహ్మణి నా లేక మరెవరెవరైనా సరే ఒడిదుడుకులను తట్టుకుని, అడ్డంకులను నెట్టుకుని, రాజకీయ వ్యూహాలను ఛేదించుకుని, కథన రంగంలోకి వెళ్లి పద్మ వ్యూహాన్ని ఛేదించిన అభిమన్యుడిలా తిరిగి రాగలిగిన ఆ ఒక్కరి కోసమే ఈ వేట, ఈ నిరీక్షణ. అయితే ఆ ఒక్కరు ఎవర్నన్నది ఇక్కడ సమాధానం చెప్పలేని ప్రశ్నగా మారింది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

DHS To Scrap Prior H-1B Deference? New Proposal Sparks Debate

The Department of Homeland Security (DHS) had proposed to end a major H-1B extension rule.…

3 hours ago

Big Films Coming But No Noise At All!

Generally, when too big films are arriving at the ticket counter correspondingly, there is a…

4 hours ago