బరిలో జూనియర్ ఎన్టీఆర్… మరొకరికి అవకాశం ఇస్తాడా..!

Chakravyuha - Jr NTR Song (1)నటనను తారక్ ఎంత సీరియస్ గా తీసుకుంటారో అన్న విషయం… బుడ్డోడు నటించిన సినిమాలు సిల్వర్ స్క్రీన్ పైన చెప్పకనే చెప్తాయి. అయితే ఇటీవల కాలంలో తారక్ సీరియస్ గా తీసుకున్న అంశం మరొకటి ఉంది. అవును… ‘నాన్నకు ప్రేమతో’ సినిమాలో తారక్ పాడిన ‘ఫాలో ఫాలో’ పాట విమర్శకుల ప్రశంసలు పొంది… ప్రొఫెషనల్ గాయకుడిగా తారక్ మరో అవతారం దాల్చాడు. అంతగా అదరగొట్టాడు కాబట్టే… కన్నడ స్టార్ హీరో ప్రేస్టేజియస్ సినిమాలో జూనియర్ చేత ఓ పాట పాడించాడు సంగీత దర్శకుడు థమన్.

ఇప్పుడు ఇదే పాట జూనియర్ ఎన్టీఆర్ ను కన్నడ నాట అవార్డుల రేసులో నిలబెట్టింది. “చక్ర్యవ్యూహ” సినిమాకు గానూ జూనియర్ ఆలపించిన పాట కన్నడ ఫిలిం ఫేర్ అవార్డ్స్ రేసులో నిలిచింది. సాధారణంగా ఒక నటుడిగా మాత్రమే రేసులో ఉండే తారక్, ఈ సారి కాస్త డిఫరెంట్ గా, అందులోనూ కన్నడ నాట ఓ గాయకుడిగా బరిలో నిలవడం విశేషం. ఈ అవార్డు బుడ్డోడుకు వచ్చినా, లేకున్నా ఇతర భాషలో పాట పాడి, అవార్డుల రేసులో నిలవడం మాత్రం ఓ అరుదైన విషయమే.

ADVERTISEMENT

సాధారణంగా నటుడిగా అవార్డుల రేసులో ఉంటే మాత్రం, మరొకరికి అవార్డు దక్కలేని విధంగా జూనియర్ క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉంది. కానీ ఇది గాయకుని అవతారం కావడంతో, ఇతర ప్రొఫెషనల్ సింగర్స్ కు షాక్ ఇచ్చే విధంగా అవార్డును దక్కించుకుంటారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే పాట హిట్ అయిన దాని బట్టి అంచనాలు చూస్తే… బరిలో నిలిచిన ‘బుడ్డోడు’ స్వరానికే పట్టం కట్టే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ADVERTISEMENT
Latest Stories