అందరి కళ్ళు ‘జబర్దస్త్’ పైనే… ఈ వారం ఉంటుందా..?

chalapathi rao comments on ETV  Jabardasth Comedy showఆదివారం నాడు జరిగిన “రారండోయ్ వేడుక చూద్దాం” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మహిళలపై చలపతిరావు చేసిన కామెంట్స్ వైరల్ అయ్యి, గత రెండు రోజులుగా మీడియా వర్గాలలో సెంటరాఫ్ అట్రాక్షన్ కావడం.., దానిపై చలపతిరావు వివరణ ఇవ్వడం… చివరికి ఎలాగోలా ఈ వివాదం సర్దుమణిగినట్లుగా కనపడుతోంది. అయితే ఈ వ్యాఖ్యలపై చర్చ చేపట్టే సమయంలో… చలపతిరావుతో సహా చాలామంది ‘జబర్దస్త్’ షోపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

ADVERTISEMENT

మహిళలను కించపరుస్తూ దాదాపుగా గంటన్నర్ర సేపుగా సాగుతున్న ‘డబుల్ మీనింగ్ డైలాగ్’ల షోను మీ ఆడవాళ్ళే చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారని, అలాగే మీ ఆడ జడ్జిలే న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారని, ఆ కార్యక్రమానికి యాంకర్ కూడా ఓ మహిళేనని, వారంతా ఎంజాయ్ చేస్తూ ప్రోత్సహిస్తుండగా, వాటినే టీవీలలో ఇళ్ళల్లో మహిళలు, ఫ్యామిలీలు చూసి ఎంజాయ్ చేస్తుండగా, వాటిని వదిలేసి తానేదో చిన్న మాట అన్నానని దానిని పట్టుకుని రాద్దాంతం చేయడంపై చలపతిరావు అభ్యంతరాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

వాస్తవానికి ఆయన చేసిన వ్యాఖ్యల్లో కూడా అర్ధం లేకపోలేదని మీడియా వర్గాలతో పాటు మహిళా సంఘాలు కూడా అంగీకరించాయి. అలాంటి షోలకు చరమగీతం పాడే రోజు దగ్గరికొచ్చిందని హెచ్చరించాయి. ప్రస్తుతం మహిళా సంఘాలన్నీ చలపతిరావు చేసిన వ్యాఖ్యల వేడిమిలో ఉన్నారు. దీంతో ఈ వారంలో ప్రసారం కాబోయే ‘జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్’ షోలపైనే అందరి కళ్ళు ఉండనున్నాయి. మునుపటి మాదిరే మహిళలను తక్కువ చేస్తూ లేక అక్రమ సంబంధాలపై పంచ్ లు పేలిస్తే ఊరుకునేందుకు మహిళా లోకం సిద్ధంగా ఉన్నట్లు కనపడడం లేదు.

ఇక్కడ వచ్చిన అసలు చిక్కు ఏమిటంటే… గురు, శుక్రవారాలలో ప్రసారం చేయాల్సిన కార్యక్రమాలు ఒక వారం, పది రోజులు ముందుగానే షూట్ చేయబడి ఉంటాయి, దీంతో అప్పటికప్పుడు కార్యక్రమంలో మార్పులు చేయడానికి అవకాశం ఉండదు. కనుక ఈ వారం మధ్యలో వచ్చిన చలపతిరావు ఉదంతాలను దృష్టిలో పెట్టుకుని ‘జబర్దస్త్’ స్కిట్ లను చేయడానికి అవకాశం ఉండదు. నిజానికి ఈ వారం ప్రసారం కాబోయే స్కిట్స్ ఏమిటో గత వారమే శాంపిల్స్ రూపంలో చూపించేశారు. అయితే అవి ఫుల్ లెంగ్త్ లో ఎలా ఉంటాయనేది వేచిచూడాలి.

ప్రసారమయ్యే నాలుగైదు స్కిట్స్ లో ఖచ్చితంగా ఓ రెండు అయితే మహిళలపైనే ఉంటాయి. అది పాజిటివ్ గా అయినా… నెగిటివ్ గా అయినా..! పాజిటివ్ అయితే పండగ చేసుకుంటారేమో గానీ, నెగటివ్ అయితే మాత్రం ఊరుకునే స్థితిలో ప్రస్తుత పరిస్థితి లేదు. మరి ఈ గురు, శుక్ర వారాలలో అసలు ‘జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్’ ఉంటుందా? అన్నది బుల్లితెర ప్రేక్షకులకు కూడా ఆసక్తికరంగానే ఉంది. బహుశా అలాంటి స్కిట్స్ ను ఎడిటింగ్ లో లేపేసి ఈ వారం సమయస్పూర్తిని ప్రదర్శిస్తారో లేక పబ్లిసిటీ వస్తుంది కాబట్టి అలాగే కొనసాగిస్తారో చూడాలి.

ADVERTISEMENT
Latest Stories