‘ట్విట్టర్’లో ట్రెండ్ అవుతోన్న మరో ‘పెద్దాయన’

chalapathi-rao-controversy-vs-akkineni-nageswara-rao-speech-viralప్రముఖ నటుడు చలపతిరావు చేసిన వ్యాఖ్యలు వైరల్ అయిన పుణ్యమా అంటూ పాత సంగతులన్నీ మళ్ళీ కొత్తగా వెలుగులోకి వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మీడియా వర్గాలు అలీ, బాలకృష్ణలు మహిళలపై చేసిన వివిధ వ్యాఖ్యలను గుర్తు చేస్తూ హోరేత్తిస్తుండగా, తాజాగా ట్విట్టర్ లో ఓ ‘పెద్దాయన’ వీడియో హల్చల్ చేస్తోంది. 2011లో సుమంత్ నటించిన “దగ్గరగా దూరంగా” సినిమా ఆడియో వేడుకలో పాల్గొన్న నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు చేసిన ప్రసంగం తాజాగా సందడి చేస్తోంది.

ఈ హంగామాకు కారణం లేకపోలేదు… ఎందుకంటే… సహజంగానే కాస్త రసికత్వంతో మాట్లాడే ఏఎన్నార్, ఈ వేడుకలో ఇంకాస్త ఎక్కువగా తన జోరును ప్రదర్శించారు. ఈ వీడియో చూసిన తర్వాత చలపతిరావు చేసిన వ్యాఖ్యల కంటే దారుణంగా ఉందిగా అనుకోవడం సహజమే! ‘అమ్మాయి వంకర టింకరలను సంగీతంలో మాధుర్యంతో పోలుస్తూ మొదలుపెట్టిన ఏఎన్నార్… చివరికి శరీరం ఏమో సహకరించట్లేదు’ అని ఓపెన్ గా చెప్పేవరకు వెళ్ళిపోయారు.

ADVERTISEMENT

‘అమ్మాయి వంకర టింకరలు నా లాంటి ముసలాడికి కూడా అవసరం’ అంటూ మొదలుపెట్టిన ఏఎన్నార్, ఈ రోజుల్లో అయితే కాస్త పైట తొలగింపులు అవన్నీ ఉన్నాయి గానీ, ఆ రోజుల్లో అయితే పెదాలు, గడ్డం పట్టుకోవడమే తప్ప, మిగాతావేం ఉండేవి కావు, అప్పటి హీరోయిన్లు కూడా ఊరుకునే వారు కాదని చెప్పడంతో అక్కడున్న వారంతా పగలబడి మరీ నవ్వారు. ఆ తర్వాత ఓ హీరోయిన్ బ్రెస్ట్ తనకు తగిలిన సన్నివేశం గురించి కూడా ఏఎన్నార్ కాస్త డీటెయిల్ గా వివరించడంతో అసభ్యతకు తావిచ్చింది.

ఆ తర్వాత కూడా మాట్లాడుతూ… అసలు అమ్మాయి ముఖం బాగుంటే… కాస్ట్యూమ్స్ ఎలాగు కుట్టాలనేది ఆలోచించాలని, ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది… ఈ తరం హీరోయిన్లను మిస్ అయిపోతున్నామా అని… ఈ వయసులో పరిగెత్తాలని అనిపిస్తుంటుంది… శరీరం ఏమో సహకరించదు అంటూ… ఏఎన్నార్ చేసిన వ్యాఖ్యల పర్యవసానం నాడు తెలియకపోవచ్చు గానీ, నేడు చలపతిరావు పుణ్యమా అంటూ వెలుగులోకి వచ్చి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అయితే హీరోయిన్లను ప్రస్తావించినపుడు ఏఎన్నార్ ఎప్పుడూ ఇలాగే ఓపెన్ గా మాట్లాడుతుంటారన్న విషయం సినీ జనాలకు తెలిసిందే.

ADVERTISEMENT
Latest Stories