యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ గా పేరుగాంచిన చందు మొండేటి దర్శకత్వం వహించిన “సవ్యసాచి” సినిమా మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. యుఎస్ ప్రీమియర్స్ తో విడుదల కానున్న ఈ సినిమా టాక్, అత్యంత కీలకం కానుంది. చిత్ర యూనిట్ అంచనాలు వేసిన విధంగా పాజిటివ్ టాక్ వస్తే హీరో నాగచైతన్య కెరీర్ లో బెస్ట్ ఓపెనింగ్స్ ను అందుకునే సినిమాగా “సవ్యసాచి” నిలుస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
[m9ad]
చైతూ “శైలజా రెడ్డి అల్లుడు” సినిమా మంచి ఓపెనింగ్స్ ను దక్కించుకున్నప్పటికీ, టాక్ సరిగా లేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోయింది. దీంతో సినిమాకు లభించే ‘ఫస్ట్ టాక్’ ఆధారంగా సినిమా సక్సెస్ రేంజ్ మారుతోంది. ఇప్పటివరకు ఎవరూ టచ్ చేయని ఓ సరికొత్త పాయింట్ ను ఇందులో చూపించామని, అది ప్రేక్షకులకు ఖచ్చితంగా నచ్చుతుందని చిత్ర యూనిట్ ఎంతో ఆశాభావంతో ఉంది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సినిమాలేవీ లేకపోవడంతో, పాజిటివ్ టాక్ వస్తే చైతూ కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ ను అందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
ఇదే సమయంలో… ఒకవేళ అంచనాలు తారుమారైతే కలెక్షన్ల పరంగా కంటే, మూడు సక్సెస్ లతో ‘హ్యాట్రిక్’ అందుకున్న మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ బ్యానర్ పై ప్రేక్షకులకు నమ్మకాలు సన్నగిల్లుతాయి. అలాగే రెండు కొట్టి హ్యాట్రిక్ అందుకోవాలని ఊవ్విళ్ళూరుతున్న దర్శకుడు చందు మొండేటి ఆశలు ఆవిరి అవుతాయి. అన్నింటి కంటే ముఖ్యంగా… ఫస్ట్ సినిమాతోనే టాలీవుడ్ తన మార్క్ చూపిద్దామని భావిస్తున్న హీరోయిన్ నిధి అగర్వాల్ కు చుక్కెదురవుతుంది. కానీ ట్రేడ్ టాక్ పరంగా అయితే “సవ్యసాచి”తో దర్శకుడు చందు మొండేటి మరో మెట్టు ఎక్కడం ఖాయం అంటున్నారు.



