కూటమికి మిత్రధర్మం ‘లక్ష్మణ రేఖ’ కానుందా…?

Chandrababu Naidu Alliance Unity

స్థానిక ఎన్నికల దృష్ట్యా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను గమనించిన సీఎం బాబు కూటమి పార్టీ నేతల గెలుపు కోసం టీడీపీ శ్రేణులకు ఒక కీలక ఆదేశం జారీ చేసారు. కూటమిలో భాగమైన జనసేన, బీజేపీ నేతల గెలుపు కోసం టీడీపీ శ్రేణులు మిత్రధర్మాన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్లాలని, పార్టీల మధ్య సీట్ల పంచాయితీలను కాసేపు పక్కన పెట్టి అభ్యర్థుల గెలుపు కోసం కలిసి నడవాలంటూ పిలుపునిచ్చారు.

2024 ఎన్నికలలో కూటమి విజయం మూడు పార్టీల రాజకీయ ప్రయోజనం తో పాటుగా రాష్ట్రానికి కూడా అభివృద్ధి మార్గంగా నిలిచిందని, అలాగే నాటి ఎన్నికల హామీలను అమలు చేస్తూ, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ పాలనా సాగిస్తున్నామని, ‘చెప్పాం చేస్తున్నాం’ ప్రచారాన్ని మరింత ముమ్మరం చేస్తూ ప్రతి చోట కూటమి జెండా ఎగరేలా చూడాలంటూ బాబు టీడీపీ తమ్ముళ్లకు దిశా నిర్దేశం చేసారు.

ADVERTISEMENT

దీనితో ఈ మూడు పార్టీల మధ్య ఉన్న మిత్ర ధర్మమే కూటమి పార్టీలను ఒకపక్క శ్రీరామ రక్ష లాగ కాపాడుతూ మరోపక్క లక్ష్మణ రేఖ మాదిరి హెచ్చరిస్తూ ఉంటుందా అన్న అభిప్రాయం వెలువడుతుంది. నాడు లక్ష్మణ రేఖను దాటిన నేరానికి సీత శ్రీరామునికి దూరమయ్యింది, రావణ లంకకు దగ్గరావాల్సి వచ్చింది.

అలాగే నేడు కూటమి శ్రేణులు కూడా తమ అధినేతలు గీసిన ఈ మిత్రధర్మం అనే లక్ష్మణ రేఖను దాటి చేతిలో ఉన్న అధికారానికి దూరమవుతారా.? వైసీపీ అవమానాలకు దగ్గరగా వెళతారా.? అనేది ఆలోచించుకోవాల్సి ఉంటుంది.

2024 సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ రాజకీయ పతనానికి, కూటమి ఘన విజయానికి కూడా ప్రాతిపదిక మూడు పార్టీల శ్రేణులు పాటించిన ఈ మిత్రధర్మమే. కూటమి నేతల విజయమే అంతిమ లక్ష్యం అన్నట్టుగా టీడీపీ, జనసేన, బీజేపీ ముందుకెళ్లగలిగితే వైసీపీ కలలు కంటున్న జగన్ 2.0 వారికి అందని ద్రాక్షే అవుతుందేమో…!

ADVERTISEMENT
Latest Stories