
223 పరిశ్రమలు వేరువేరు నిర్మాణ దశలలో ఉన్నవి. కొన్ని ఇప్పటికే ఆపరేషన్లు మొదలు పెట్టాయి. వీటి ద్వారా 1.88 లక్షలు ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చాయి. శ్రీసిటీ కేంద్రంగా ఎక్కువ పరిశ్రమలు వచ్చాయి. రానున్న 2-3 సంవత్సరాలలో వీటి ఫలాలు రాష్ట్రానికి అందబోతున్నాయి. అయితే అమరావతిలో వీటిలో నాలుగో వంతు పెట్టుబడులు కూడా రాలేదు అని గణాంకాలు చెబుతున్నాయి.
అయితే ప్రభుత్వం ఈ విషయాన్నీ సరిగ్గా చెప్పుకోలేక రాజకీయంగా వెనుకబడుతుందనే చెప్పుకోవాలి. ‘అప్పుడు అన్ని హైదరాబాద్ కే, ఇప్పుడు అన్ని అమరావతికే’ అనే దుష్ప్రచారం ప్రజల్లోకి వెళ్తుంది. రాయలసీమకు ఇప్పటివరకు ఎప్పుడు ఏ ప్రభుత్వం ఇవ్వనంత ఎక్కువ నీరు పట్టిసీమ పుణ్యమా అని ఈ సంవత్సరం ప్రభుత్వం ఇచ్చింది.
అయితే చేసినవి చెప్పుకోవడంలో తెలుగు దేశం ప్రభుత్వం ఎప్పటిలానే విఫలం అవుతుంది. మరోపక్క గోదావరి నీళ్ళు కృష్ణా డెల్టాకు, రాయలసీమకు తరలించుకుపోతున్నారని గోదావరి జిల్లాలలో ప్రచారం మొదలు పెట్టారు. వీటి అన్నిటిపై సరైన విధానం లేకపోతే నష్టపోవడం తప్పక పోవచ్చు.
Telangana is planning a massive new cricket stadium in Bharat Future City near Hyderabad. The…
Art director and TTD Board Member Anand Sai’s son Sandeep has been arrested by Cyberabad…