Telugu

చంద్రబాబు ప్రకటనని వైసీపీ బాగానే క్యాచ్ చేసిందే!

కూటమి ప్రభుత్వం ఏ అభివృద్ధి పనులు మొదలుపెట్టినా వాటిపై వైసీపీ దుష్ప్రచారం చేస్తూనే ఉంది. కానీ వాటికి శంకుస్థాపనలు చేస్తున్నప్పుడో, పనులు పూర్తి చేసి వాటికి ప్రారంభోత్సవం చేస్తున్నప్పుడో మేమే వాటిని మొదలుపెట్టామని నిసిగ్గుగా చెప్పుకుంటోంది.

నాడు జగన్‌ చేసిన కృషి వల్లనే నేడు అవి పూర్తవుతున్నాయని, వాటి క్రెడిట్ చంద్రబాబు నాయుడు కొట్టేస్తున్నారంటూ అక్రోశిస్తూనే ఉంది.

ADVERTISEMENT

ఆగస్ట్ 1న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం జరుగుతున్నప్పుడు వైసీపీ ఎంత కన్నీళ్ళు కార్చిందో అందరూ చూశారు.

ఆ రోజు సభలో సిఎం చంద్రబాబు నాయుడు 2026లో భోగాపురం పూర్తి చేశాం. 2027లో పోలవరం, 2028లో అమరావతి మొదటి దశ పూర్తి చేస్తామని ప్రకటించడంతో వైసీపీ అప్పుడే అప్రమత్తమైంది. దానినీ మేమే నిర్మించామని చెప్పుకోవడం మొదలుపెట్టింది.

“వైయస్ జగన్ గారి కృషితో తిరుగులేని స్థితికి చేరుకున్న పోలవరం! ప్రాజెక్టులోని 48 రేడియల్ స్పిల్‌వే గేట్ల ద్వారా దాదాపు 12 లక్షల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల ప్రాజెక్టు వద్ద నీటి మట్టాలు గణనీయంగా పెరిగినా, గరిష్ఠ వరద ప్రవాహాన్ని తట్టుకునేలా అప్పట్లో వైయస్ జగన్ గారు చర్యలు.

ఇప్పుడు స్పిల్‌వే వద్ద నీటి మట్టం +34.150 మీటర్లకు, ఎగువ కాఫర్ డ్యామ్ వద్ద నీటి మట్టం +34.450 మీటర్లకు చేరుకున్నా చెక్కుచెదరని పోలవరం #YSRPolavaram “ అని వైసీపీ సోషల్ మీడియాలో ప్రకటించుకుంది.

అయితే నాడు జగన్‌ అధికారంలోకి రాగానే మొట్ట మొదట చేసిన పని జోరుగా సాగుతున్న పోలవరం పనులకు రివర్స్ టెండరింగ్ పేరుతో బ్రేకులు వేసి నిలిపివేయడం. నీటిపారుదల శాఖ మంత్రి పదవి వెలగబెట్టిన అంబటి రాంబాబు, ఐరేళ్ళ పాటు డయాఫ్రం వాల్ కొట్టుకుపోయిందనే పాట పాడుతూ కాలక్షేపం చేసేశారు.

ఓ మంచి రోజు చూసుకొని “పోలవరం ఒక బ్రహ్మ పదార్ధం వంటిది. దాని గురించి నాకే అర్థం కాలేదు. కనుక ఎవరికీ అర్థం కాదు. ఐదేళ్ళు సమయం ఉన్నా సరిపోదు. అది ఎప్పటికి పూర్తవుతుందో కూడా తెలీదు,” అని అన్నారు.

కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్ళలో దాని నిర్మాణ పనులు వేగవంతం చేసి, వచ్చే ఏడాది పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందని చెప్పగానే, అది మేమే కట్టామని వైసీపీ నిసిగ్గుగా చెప్పుకుంటోంది.

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రాజధాని కట్టొద్దని ప్రజలేమైనా అడ్డుపడ్డారా? పరిశ్రమలు, ఐటి కంపెనీలు తేవద్దన్నారా? పోలవరం, భోగాపురం విమానాశ్రయం నిర్మించద్దని అడ్డుకున్నారా? లేదు కదా?

కానీ 5 ఏళ్ళు ఏమీ చేయకుండా బటన్ నొక్కి ప్రజలకు డబ్బు పంచుతూ, అదే అభివృద్ధి అని కొత్త నిర్వచనం చెప్పింది. జగన్‌ బొమ్మలు, పేర్లు, రంగులతో కాలక్షేపం చేసింది తప్ప కనీసం రోడ్లపై గుంతలు కూడా పూడ్చలేదు. అందుకే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వంటివారు పార్టీకి రాజీనామా చేసి బయటకు వెళ్ళిపోయారు.

అలాంటి వైసీపీ భోగాపురం మేమే నిర్మించాం.. ఇప్పుడు పోలవరం కూడా మేమే అంటోంది. జగన్‌ తాడేపల్లిలో ప్యాలస్‌ నిర్మించుకున్నారు కనుక రేపు అమరావతి కూడా మేమే నిర్మించామని చెప్పుకున్నా ఆశ్చర్యం లేదు. అప్పుడు సిఎం చంద్రబాబు నాయుడుకి చెప్పుకోవడానికి ఏమీ మిగలదు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Two Star Kids, One Painful Reality Check

In the film industry, a famous surname can make the first step much easier. It…

31 minutes ago

Why Is Every Star Fan Meet Becoming Political?

Not every fan meeting is a political rehearsal. But in Tamil Nadu today, it is…

1 hour ago