
ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు నేడు స్వాతంత్ర్య దినోత్సవం నాడు విజయవాడలో స్త్రీశక్తి పధకం ప్రారంభించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా బస్సులో మహిళలకు ‘జీరో టికెట్’ అందించి వారితో కలిసి బస్సులో కూర్చొని ప్రయాణించారు. ముఖ్యమంత్రి అంతటి వ్యక్తి తమతో కలిసి బస్సులో ప్రయానిస్తుండటంతో మహిళలు సంతోషంతో పొంగిపోయారు. డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కూడా మహిళలను ఆప్యాయంగా పలకరించి సిఎం చంద్రబాబు నాయుడుతో కలిసి బస్సులో ప్రయాణించారు. ముఖ్యమంత్రి అంతటి వ్యక్తి తమతో కలిసి బస్సులో ప్రయానిస్తుండటంతో మహిళలు సంతోషంతో పొంగిపోయారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడలో ఈ పధకం ప్రారంభించిన తర్వాత జిల్లాలలో మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా పచ్చ జెండాలు ఊపి స్త్రీశక్తి పధకం ప్రారంభించారు. నేడు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల కారణంగా రాష్ట్రంలో పండుగ వాతావరణం నెలకొని ఉంది. ఇప్పుడు ముఖ్యమంత్రి,ఉప ముఖ్యమంత్రి, మంత్రులు అందరూ ఈ పధకం ప్రారంభించి మహిళలతో కలిసి బస్సులలో ప్రయాణించడంతో ఈ పండుగ వాతావరణం మరింత పెరిగినట్లయింది. ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి ఆర్టీసీ బస్సులలో మహిళలు, విద్యార్ధినులు, ట్రాన్స్ జెండర్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా ప్రయాణించవచ్చు.
సిఎం చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ హామీలు అమలు చేయలేదంటూ గొంతు చించుకుంటున్న వైసీపీ అధినేత జగన్ నేడు బయట కనపడలేదు. ఈ పధకం గురించి మాట్లాడలేదు. అయినా పధకం అమలుచేస్తుంటే ఏమని విమర్శించగలరు?కానీ వైసీపీ నేతలు, వారి మీడియా మాత్రం ఏసీ, వొల్వో, గరుడ, నాన్-స్టాప్ బస్సులలో ఈ పధకం అమలుచేయడం లేదంటూ ఈ పధకానికి వారి సన్నాయి వాయిద్యం వినిపిస్తూనే ఉన్నారు!
Fauzi is now reportedly targeting a March 18, 2027 release. The film was originally scheduled…
The bodycam footage of an arrest has gone viral on Instagram. The footage shows police…