
Chief Minister Chandrababu Naidu asked IAS and IPS officers to take timely action against activities that threaten law and order in Andhra Pradesh.
ఆంధ్రప్రదేశ్ సిఎం చంద్రబాబు నాయుడు వైసీపీ రాజకీయాలు చేస్తున్న తీరుని తప్పు పట్టారు. అయితే అప్పుడు కూడా వైసీపీ అని పేరు పెట్టి విమర్శించకుండా కొన్ని ప్రతిపక్ష పార్టీలు అంటూ పద్దతి పాటించడం గమనార్హం.
రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల సమావేశంలో మాట్లాడుతూ, “కొన్ని ప్రతిపక్ష పార్టీలు మరీ బరి తెగించినట్లు వ్యవహరిస్తున్నాయి. అలాంటప్పుడు వారిని కట్టడి చేయకపోతే శాంతి భద్రతలు అదుపు తప్పుతాయి. పరిస్థితి అంతవరకు వచ్చే వరకు ఎదురుచూస్తూ కూర్చోవడం వలన అప్పుడు సమస్య మరింత జటిలం అవుతుంది. అప్పుడు శాంతి భద్రతలను చక్కదిద్దడం మరింత కష్టమవుతుంది.
రాష్ట్రంలో డీజీపీ కానిస్టేబుల్ వరకు అన్ని స్థాయిలలో అధికారులు, సిబ్బంది ఉన్నప్పుడు పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ, శాంతిభద్రతల సమస్యలు సృష్టిస్తున్నవారిని తక్షణం కట్టడి చేయాలి. అలాగే సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నవారిని, వ్యక్తిత్వహననానికి పాల్పడుతున్నవారిని గుర్తించి తక్షణం చర్యలు తీసుకోవాలి.
ఇది వరకు మావాళ్ళలో కూడా కొందరు ఓవర్ యాక్షన్ చేస్తే వెంటనే వారిపై కటిన చర్యలు తీసుకోవడం వల్లనే రాష్ట్రంలో ఫ్యాక్షనిజం మటుమాయం అయ్యింది. కనుక ఇప్పుడు మీరు కూడా మీశక్తిసామర్ధ్యాలను, మీ సిబ్బందిని అన్నిటినీ సమర్ధంగా వినియోగించుకుంటూ రాష్ట్రంలో ఎప్పటికీ శాంతిభద్రతలు నెలకొని ఉండేలా చూడాల్సిన బాధ్యత మీపైనే ఉంది,” అని సిఎం చంద్రబాబు నాయుడు అన్నారు.
అయన వైసీపీని కట్టడి చేయాలని చెపుతున్నట్లుగా అనిపించవచ్చు. కానీ ఆయనే కాదు ఏ ముఖ్యమంత్రి అయినా రాష్ట్రంలో శాంతిభద్రతలు నెలకొని ఉండాలని, అవి అదుపు తప్పకుండా చూడాలనే కోరుకుంటారు. లేకుంటే రాష్ట్రంలో ఎవరూ ప్రశాంతంగా జీవించలేరు. ఏ రాష్ట్రమూ అభివృద్ధి సాధించలేదు. ఏ ప్రభుత్వమూ మనుగడ సాగించలేదు.
యూపీ, బిహార్ వంటి రాష్ట్రాలలో దశాబ్దాల పాటు ఇలాంటి అరాచక పరిస్థితులే నెలకొని ఉండేవి. కనుక అక్కడి ప్రజలకు ఉద్యోగాలు, ఉపాధి లభించక ఇతర రాష్ట్రాలకు వలసలు పోతుంటారు. నేటికీ పోతూనే ఉన్నారు.
కనుక అక్కడ చెలరేగిపోతున్న అసాంఘిక శక్తులను ముఖ్యమంత్రులు గట్టిగా కట్టడి చేయడం మొదలు పెట్టాకనే ఆ రెండు రాష్ట్రాలలో పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోంది.
దక్షిణాది రాష్ట్రాలలో అంత అరాచకం లేనప్పటికీ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడు ప్రతిపక్షంలోకి మారిన తర్వాత కూడా అరాచక ధోరణి ప్రదర్శిస్తూనే ఉంది.
‘రప్పారప్పా తలకాయలు నరికేస్తామని ఫ్లెక్సీ బ్యానర్లు పెట్టి మరీ బెదిరించడం వంటివి ఇందుకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి.
అమరావతి మొదలు డీఎస్సీ వరకు ప్రతీ దానిలో ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందంటూ సోషల్ మీడియాలో చేస్తున్న దుష్ప్రచారం కేవలం ఏపీ రాజకీయాలకే పరిమితం కాదు. వాటి ప్రభావం రాష్ట్రంలో పరిశ్రమలు, ఐటి కంపెనీలు స్థాపించేందుకు ముందుకు వస్తున్నవారిపై కూడా పడుతుంది.
అందుకే సిఎం చంద్రబాబు నాయుడు చాలా పద్దతిగా శాంతిభద్రతలకు భంగం కలిగించాలని ప్రయత్నించే వారినెవరినీ ఉపేక్షించవద్దని చెప్పారు.
ఆయన సూచనపై వైసీపీ ఏవిధంగా స్పందిస్తుందో తేలికగానే ఊహించవచ్చు. కానీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఏవిధంగా పనిచేస్తారనేదే ముఖ్యం.
కొన్ని అపోజిషన్ పార్టీలు బరితెగిస్తున్నాయి..
వారిని ఎప్పటికప్పుడు కంట్రోల్ చేయకపోతే లా అండ్ ఆర్డర్ ఎప్పటికీ అదుపులోకి రాదు..గతంలో మా వాళ్లను కూడా అరెస్టు చేసి కఠినంగా ఉన్నాం కాబట్టే ఫ్యాక్షనిజం వంటివి పోయాయి..
సోషల్ మీడియాను క్యారెక్టర్ అసాసినేషన్ కోసం వాడుతున్నారు.. కరెక్ట్… pic.twitter.com/5Vdf8omEIw
— Telugu Desam Party (@JaiTDP) July 23, 2026
Drishyam: The Conclusion is creating a lot of buzz with a few more days left…
Eshaanya Mmaheshwari is turning up the heat and setting major fashion goals in her latest…