Telugu

సుప్రీం తీర్పుపై సిఎం స్పందన…పెర్ఫెక్ట్

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం కుదరదంటూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన నేపధ్యంలో సిఎం చంద్రబాబు నాయుడు స్పందన చాలా హుందాగా ఉంది. సుప్రీంకోర్టు తీర్పుని గౌరవిస్తున్నామన్నారు.

“బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు మా ప్రభుత్వం సంకల్పిస్తే, గొడ్డలి పార్టీ దానిని అడ్డుకునేందుకు కోర్టుని ఆశ్రయించింది. అయినా మా ప్రభుత్వం పట్టుదలగా సుప్రీంకోర్టుకు వెళ్ళి బీసీలకు న్యాయంగా దక్కాల్సిన ఈ వాటా కోసం పోరాడింది. కానీ సుప్రీంకోర్టు ఆమోదించలేదు.

ADVERTISEMENT

చట్టపరంగా బీసీ రిజర్వేషన్లు సాధ్యం కాకపోయినా వారికి ఇచ్చిన మాటకు కట్టుబడి పార్టీ పరంగా బీసీలకు 34 శాతం సీట్లు కేటాయించి న్యాయం చేస్తాము.

నిజానికి తెలుగుదేశం పార్టీ అవతరించిన తర్వాతే బీసీలకు రాజ్యాధికారంలో సముచిత భాగం కలిగింది. బీసీ ఫెడరేషన్లకు టీడీపియే నాంది పలికింది. కులవృత్తులు చేసుకొనే బీసీల సంక్షేమం కోసం మా ప్రభుత్వం అనేక ‘ఆదరణ’ వంటి అనేక పధకాలు అమలుచేస్తోంది.

ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా ఈ విధానానికి టీడీపి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుంది. వడ్డేర్లకు 10 శాతం మైనింగ్ లీజులు, నేతన్న సేవలో పధకం కింద ఒక్కో కుటుంబానికి ఏడాదికి రూ.25,000 ఆర్ధిక సాయం అందిస్తున్నాము.

సముద్రంలో చేపల వేటపై నిషేధం అమలులో ఉన్నప్పుడు మత్స్యకారులకు ఉపాధి, ఆదాయం ఉండవు. కనుక మత్సకారుల సేవలో పధకం కింద ఒక్కో కుటుంబానికి రూ.20,000 చొప్పున ఆర్ధిక సాయం అందిస్తున్నాము. మత్స్యకారులకు సబ్సీడీ మీద పడవలు, వాటికి డీజిల్ కూడా ఇస్తున్నాము.

అలాగే నాయి బ్రాహ్మణులు, స్వర్ణకారులు, ఇంకా బీసీల్లో పలు కుల వృత్తులు చేసుకొనే వారి కోసం మా ప్రభుత్వం అనేక కొత్త పధకాలు తీసుకువచ్చింది.

చట్టాలు, కోర్టు తీర్పులతో సంబంధం లేకుండా బీసీల సంక్షేమం కోసం మా ప్రభుత్వం ఇన్ని పధకాలు అమలు చేస్తోంది. బీసీలకు టీడీపి ఎప్పుడు మేలే చేసింది తప్ప కీడు చేయాలని కలలో కూడా అనుకోలేదు.

ఈ కారణంగా బీసీలు టీడీపితో ఉన్నారనే కక్షతో గొడ్డలి పార్టీ అధికారంలోకి రాగానే బీసీ రిజర్వేషన్లను 34 నుంచి 24 శాతానికి తగ్గించేసింది. దీని వలన ఏకంగా 16,800 మంది బీసీలు పదవులు కోల్పోయారు. గత ప్రభుత్వం మత్స్యకార సొసైటీలను దెబ్బ తీసేవిధంగా జారీ చేసిన 217 జీవో జారీ చేస్తే, మేము అధికారంలోకి రాగానే దానిని రద్దు చేసి వారి హక్కులను కాపాడాము,” అంటూ సిఎం చంద్రబాబు నాయుడు బీసీ సంక్షేమం కోసం తమ ప్రభుత్వం చేపడుతున్న పధకాల గురించి నేడు మీడియాకు వివరించారు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Bowling Like His Prime Days: Still Out! Selection Bias

Mohammed Shami is still hoping for another chance to play for Team India, and his…

26 minutes ago

బీసీ రిజర్వేషన్లపై సుప్రీం తీర్పు.. ఊహించిందే

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోలను హైకోర్టు…

33 minutes ago