బాబుకి సరిపోవా 4 వారాలు!

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు బెయిల్ మంజూరు అయ్యి, మరికొద్దిసేపట్లో రాజమండ్రి జైలు నుండి విడుదల కానున్నారన్న ఆనందంలో పార్టీ అభిమానులు, కార్యకర్తలు ఉన్నారు. బహుశా ఈ విషయం వైసీపీకి ముందే తెలుసా? అనే ప్రశ్న ఈ సందర్భంగా తలెత్తక మానదు.

ఎందుకంటే నేడు చంద్రబాబుకు బెయిల్ మంజూరు కాగా, నిన్నే ఏపీ సీఐడీ మరో కొత్త కేసును చంద్రబాబుపై పెట్టింది. లిక్కర్ లో మతలబులు అంటూ మరో కొత్త వాణిని అందుకుంది. అయితే ఈ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసే అవకాశాలు లేకపోయినప్పటికీ, బహుశా నేటి విడుదలను కాస్త జాప్యం చేసి తమ అభిమతాన్ని వైసీపీ వర్గం ప్రదర్శించవచ్చు.

ADVERTISEMENT

అయితే చంద్రబాబు విడుదల తథ్యం గనుక టీడీపీ వర్గాలతో పాటు సామాన్య ప్రజానీకం కూడా ఆ ముహూర్తం కోసం వేచిచూస్తుందని చెప్పకతప్పదు. చంద్రబాబు విడుదల అనేది ఖచ్చితంగా వైసీపీకి మింగుడుపడని అంశమే. మళ్ళీ ఏదొక కేసుతో బాబుని జైలుకు పంపాలని వ్యూహాలు రచిస్తుంది.

ఏది ఏమైనా చంద్రబాబు చేతిలో నాలుగు వారాల సుదీర్ఘ సమయం ఉంది. ఈ నాలుగు వారాల్లో ఏపీ రాజకీయాలలో పెను మార్పులు చోటు చేసుకోబోతున్నాయని చెప్పడంలో సందేహం లేదు. ఓ విధంగా చెప్పాలంటే చంద్రబాబు తమ చాణక్య వ్యూహాలను అమలు పరుచుకోవడానికి చేతిలో 4 వారాల సమయం ఉంది.

గత ఎన్నికల ముందు చంద్రబాబు వేసిన ప్రతి అడుగు వైసీపీకి అనుకూలంగా మారింది. అయితే ఈ సారి దాని నుండి పాఠాలు నేర్చుకుని తగిన విధంగా జగన్ అండ్ కో కు చెక్ పెట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఓ విధంగా 40 ఏళ్ళ పాటు రాజకీయాలు చేసిన చంద్రబాబుకు ఈ సార్వత్రిక ఎన్నికలు కఠిన పరీక్ష పెట్టబోతున్నాయి.

ఇందులో నెగ్గాల్సిన అవసరం చంద్రబాబు కంటే కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యంత అవసరం. గడిచిన ఐదేళ్లల్లో రాష్ట్రాన్ని మరో 20 ఏళ్ళ పాటు వెనక్కి తీసుకువెళ్లిన జగన్ పాలనకు చరమగీతం పాడి, రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే అనుభవజ్ఞుడిగా చంద్రబాబును మించిన వారు లేరనేది జగమెరిగిన సత్యం.

గతంలో చేసిన పొరపాట్లను సరిచేసుకుంటూ జాగ్రత్తగా అడుగులు వేస్తే, ఈ సారి జగన్ ను పరాభవానికి గురిచేయడం చంద్రబాబుకు కష్టమైన విషయమేమి కాదు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా ఇందులో కీలక పాత్ర పోషించాల్సి ఉండడంతో, చంద్రబాబు ఏ విధంగా దీనిని పరిష్కరిస్తారనేది వేచిచూడాలి.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Manoj’s Tragedy Continues: Great Story but BO Doubtful?

What happens when the home you call yours becomes the one thing standing between an…

7 minutes ago

కాంగ్రెస్ లో కొండా చిచ్చు ఆరినట్టేనా.?

తెలంగాణ కాంగ్రెస్ లో కొండా సుస్మిత రేపిన రాజకీయ చిచ్చు కొండా సురేఖ మంత్రి పదవి బర్తరఫ్ తో పూర్తిగా…

20 minutes ago