
Chandrababu Naidu Focuses on Jobs and Development
గత వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పధకాలతోనే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని, అదే రాష్ట్రాభివృద్ధిగా వాదిస్తూ ఉండేది. జగన్ 5 ఏళ్ళ పాలనలో ఈ విధానానికే కట్టుబడి ఉన్నారు. కానీ ప్రజలు, ముఖ్యంగా యువత సంక్షేమ పథకాల పేరుతో వచ్చే డబ్బు కోసం ప్రభుత్వంపై ఆధారపడటానికి అలవాటుపడితే, దీర్గకాలంలో ఇది సమాజానికి చాలా ప్రమాదకరంగా మారుతుంది.
అయితే చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారం చేపట్టినా పరిశ్రమలు, ఐటి కంపెనీలను రప్పించి ఉద్యోగాల కల్పనకు గట్టిగా కృషి చేస్తుంటారు. ఈసారి కూడా అలాగే చేస్తున్నారు.
ఈ రెండున్నరేళ్ళలో దాదాపు రూ.20 లక్షల కోట్లు పైగా పెట్టుబడులతో అటు చిత్తూరు, నెల్లూరు నుంచి ఇటు శ్రీకాకుళం వరకు అనేక పరిశ్రమలు, పోర్టులు నిర్మిస్తూ లక్షలాది ఉద్యోగాలు కల్పిస్తున్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముందుగా ప్రభుత్వోద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఆ ప్రకారమే వరుసగా నోటిఫికేషన్లు జారీ చేస్తోంది.
ఈ ఏడాదిలోనే మెగా డీఎస్సీ ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసిన ప్రభుత్వం, ఇటీవలే మరో 2,721 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మరో నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే.
ఇదే విధంగా ఈ ఏడాది అక్టోబర్ నెలలో గ్రూప్-2లో 686 పోస్టులు భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. తాజాగా ఖాళీ అయిన మరో 34 పోస్టులు కూడా జోడించి మంగళవారం మరో నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో డీఎస్సీ ద్వారా2,721 పోస్టులు, ఏపీపీఎస్సీ ద్వారా 720 పోస్టులు కలిపి మొత్తం 3,441 పోస్టులు భర్తీ చేయబోతోందన్న మాట!
ప్రభుత్వ నిర్వహణకు ఉద్యోగాల భర్తీ అనివార్యం. కానీ ఆర్థిక, రాజకీయ, న్యాయ పరమైన కారణాల వలన ఉద్యోగాల భర్తీ విషయంలో ఒక్కో ప్రభుత్వ ఆలోచన, విధానం ఒక్కో విధంగా ఉంటుంది.
కానీ సీఎం చంద్రబాబు నాయుడు ఎప్పుడు సీఎంగా బాధ్యతలు చేపట్టినా ప్రాజెక్టుల నిర్మాణ పనులు, మౌలిక వసతుల అభివృద్ధి, రాష్ట్రంలో పరిశ్రమలు, పెట్టుబడులతో పాటు ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కూడా తప్పనిసరి చేస్తారు.
వీటికి తోడు అమరావతి, పోలవరం వంటి రెండు అతిభారీ ప్రాజెక్టు పనులు వేగవంతం చేశారు. అందువల్లే ఇరుగు పొరుగు రాష్ట్రాలలో సిఎం చంద్రబాబు నాయుడుని రాజకీయ శత్రువుగా భావించే రాజకీయ నాయకులు సైతం ఆయనను ప్రశంశిస్తుంటారు.
విజయసాయిరెడ్డి ‘పరివర్తన రాజనీతి పార్టీ’ (పీఆర్పీ) ప్రకటిస్తూ వైసీపీ, కూటమి ప్రభుత్వంపై చాలా విమర్శలే చేశారు. వీటిపై ఆ రెండు…
A US jury has found Naresh Bhatt, a 39-year-old Nepalese American man of Indian origin,…