Telugu

ఏపీలో ధన్యవాదాలు… తెలంగాణలో తీర్మానాలు!

ఈసారి మోడీ ప్రభుత్వంలో టిడిపి కీలక భాగస్వామిగా ఉన్నందున కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి భారీగా నిధులు, ప్రాజెక్టులు మంజూరు అవుతున్నాయి.

రైల్వే బడ్జెట్‌లో ఏపీలో రూ.9,151 కోట్లు కేటాయించిన్నట్లు రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ లోక్‌సభలో ప్రకటించారు. రాజధాని అమరావతితో చుట్టు పక్కల ప్రాంతాలను అనుసంధానం చేస్తూ 2,047 కోట్లు వ్యయంతో 56 కిమీ పొడవునా కొత్త రైల్వే లైన్లు నిర్మిస్తామని, వాటిలో భాగంగా కృష్ణా నదిపై కొత్తగా మరో భారీ వంతెన కూడా నిర్మించబోతున్నామని చెప్పారు.

ADVERTISEMENT

రాజధాని అమరావతిలో అత్యాధునికమైన హంగులతో అంతర్జాతీయ ప్రమాణాలతో కొత్తగా రైల్వే స్టేషన్ ఏర్పాటు చేస్తామని, విజయవాడ రైల్వే స్టేషన్‌ని ‘అమృత్ స్టేషన్’ జాబితాలో చేర్చామని దానిని మరింత అభివృధ్ది చేస్తామని చెప్పారు.

అనకాపల్లితో పాటు రాష్ట్రంలో మరో 15 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రానికి రైల్వే బడ్జెట్‌లో రూ.5,336 కోట్లు కేటాయించిన్నట్లు రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు.

ఇదివరకు జగన్‌ సిఎంగా ఉన్నప్పుడు రాష్ట్రానికి నిధులు, ప్రాజెక్టుల కోసమే వెళుతున్నానని చెప్పుకునేవారు. కానీ ఆయన అప్పులు మాత్రమే అడిగేవారు కనుక కేంద్రం అప్పులే ఇప్పించేది.

కానీ చంద్రబాబు నాయుడు అమరావతి, పోలవరం ప్రాజెక్టులకు భారీగా నిధులు కేటాయించాలని, రైల్వే, రోడ్ ప్రాజెక్టులు, విమానాశ్రయాలు కేటాయించాలని, పారిశ్రామిక కారిడర్లు ఏర్పాటు చేయాలని కోరారు. కనుక రాష్ట్రానికి అవే మంజూరవుతున్నాయిప్పుడు.

అయితే బీజేపీ దురదృష్టమో లేదా ఆంధ్రప్రదేశ్‌ అదృష్టమో గానీ మోడీ ప్రభుత్వానికి ఈసారి టిడిపి మద్దతు అవసరమైంది. కనుకనే ఈవిదంగా రాష్ట్రానికి నిధులు, ప్రాజెక్టులు మంజూరు అవుతున్నాయి.

ఒకవేళ బీజేపీకి సొంతంగా పూర్తి మెజారిటీ వచ్చి ఉండి ఉంటే, దాంతో టిడిపి పొత్తు ఉన్నప్పటికీ ఏపీకి ఇన్ని నిధులు, ప్రాజెక్టులు మంజూరు అయ్యి ఉండేవా?అంటే కాదనే భావించవచ్చు. ఇందుకు ఉదాహరణగా పక్క రాష్ట్రం తెలంగాణ కనిపిస్తోంది.

ఏపీకి నిధులు, ప్రాజెక్టులు కేటాయిస్తున్నందుకు టిడిపి కూటమి ప్రభుత్వం శాసనసభలో కేంద్రానికి ధన్యవాదాలు తెలుపుతుంటే, తెలంగాణ శాసనసభలో కేంద్రం వివక్షని ఖండిస్తూ తీర్మానం చేసి ఆమోదించారు. తెలంగాణ పట్ల కేంద్రం వివక్షని నిరసిస్తూ సిఎం రేవంత్‌ రెడ్డి ఈ నెల 27న ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన జరుగబోయే నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు నిన్న శాసనసభలో ప్రకటించారు.

అంతే కాదు… రేవంత్‌ రెడ్డి అధ్వర్యంలో ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్‌, బిఆర్ఎస్, వామపక్షాలు దీక్ష చేసేందుకు సిద్దం అవుతున్నాయి కూడా. ఒకే సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల శాసనసభలలో ఇంత విభిన్నమైన చర్చలు జరుగుతుండటం విశేషం.

చివరిగా ఓ మాట: జగన్‌ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజకీయాలు చేశారు. మళ్ళీ ఇప్పుడూ చేస్తున్నారు. అది సహజమే. కానీ జగన్‌ సిఎం అయిన తర్వాత కూడా 5 ఏళ్ళు రాజకీయాలు, రాజకీయ కక్షలతోనే కాలక్షేపం చేసి దిగిపోయారు.

కానీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజల అదృష్టం కొద్దీ సిఎం చంద్రబాబు నాయుడుకి రాజకీయ కక్షల కంటే రాష్ట్రాభివృద్ధిపైనే ఆసక్తి ఎక్కువ. ఇప్పుడు రాజకీయంగా పరిస్థితులు కూడా చాలా అనుకూలిస్తున్నాయి. కనుక 5 ఏళ్ళ జగన్‌ విధ్వంస పాలనలో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి మంచి రోజులు వచ్చినందుకు చాలా సంతోషం.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Not Only Rajini, But He Also Can Deliver 500 Cr?

Rajinikanth is going to return to the big screen tomorrow with his new film Jailer…

32 minutes ago

స్థానికంలో మచ్చుకి కొన్ని ఆలోచనలు, అభిప్రాయాలు…

స్థానిక సంస్థల ఎన్నికలలో సీట్ల సర్దుబాట్ల విషయంలో సోషల్ మీడియాలో ఇరు వర్గాల మద్దతుదారులు చేస్తున్న వ్యాఖ్యలు చాలా ఆసక్తికరంగా…

53 minutes ago