Telugu

చంద్రబాబు నాయుడు స్పీడు మామూలుగా లేదుగా!

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నా లేకపోయినా ఎప్పుడూ ప్రజల మద్యనే ఉంటారని అందరికీ తెలుసు. కనుక ఎన్నికల వరకు ఆయనను ఏదో విదంగా జైల్లో నిర్బందించి ఉంచి ప్రజల మద్యకు రానీయకుండా చేస్తే, టిడిపిని అవలీలగా ఓడించి మళ్ళీ అధికారంలోకి రావచ్చని వైసీపి భావించింది.

కానీ వైసీపి ఒకటనుకొంటే జరిగింది మరొకటి. ఆయనని నిర్బందించినందుకు ప్రజలలో ఆయన పట్ల సానుభూతి పెరిగింది. అందుకే ఆయన రాష్ట్రంలో తీర్ధయాత్రలు చేస్తుండగానే ప్రజలు బ్రహ్మరధం పడుతున్నారు. గత మూడు నెలలుగా ప్రజల మద్యకు రాలేకపోయిన చంద్రబాబు నాయుడు, ఈ నెల 10వ తేదీన ప్రజల మద్యకు రాబోతున్నారు.

ADVERTISEMENT

ఏపీ పంచాయితీరాజ్ ఛాంబర్ మరియు ఏపీ సర్పంచుల సంఘం అధ్వర్యంలో రాష్ట్రంలో నాలుగు ప్రాంతాలలో సమావేశాలు జరుగనున్నాయి. వాటిలో చంద్రబాబు నాయుడు పాల్గొనబోతున్నారు. ఈ నెల 10న శ్రీకాకుళం, 11న కాకినాడ, 14న నరసారావుపేట, 15న కడప జిల్లాలో జరుగబోయే ఈ సమావేశాలకు రాష్ట్రం నలుమూలల నుంచి పార్టీలకు అతీతంగా సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు పాల్గొనబోతున్నారు.

కేంద్ర ప్రభుత్వం పంచాయితీలకు ఇస్తున్న నిధులను జగన్‌ ప్రభుత్వం పక్కదారి పట్టించి వాడేసుకొంటుండటంతో, పంచాయితీలు నిర్వీర్యం అవుతున్నాయని, గ్రామాభివృద్ధి పనులు నిలిచిపోతున్నాయని, సర్పంచ్‌లు ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోతున్నారని వారి సంఘాలు ఆరోపిస్తున్నాయి.

ఈ సమావేశాలలో ఇటువంటి సమస్యలపై చర్చించబోతున్నారు. గ్రామస్థాయి రాజకీయాలను శాశించే వీరితో చంద్రబాబు నాయుడు సమావేశం అవుతుండటం టిడిపికి చాలా కీలకమైనదిగా భావించవచ్చు.

ఈ సమావేశాలలో పాల్గొనబోయే ముందు చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళి కేంద్ర ఎన్నికల కమీషన్‌ని కలువబోతున్నారు. వైసీపి ప్రభుత్వం రాష్ట్రంలో లక్షలాది దొంగ ఓట్లను చేర్చుతూ, టిడిపి సానుభూతిపరుల ఓట్లను తొలగిస్తోందని, రాష్ట్ర ఎన్నికల సంఘానికి టిడిపి నేతలు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేస్తున్నా పట్టించుకోవడం లేదని, కనుక తక్షణం ఈ వ్యవహారంపై లోతుగా దర్యాప్తు జరిపించి అవకతవకలను సరిచేయవలసిందిగా చంద్రబాబు నాయుడు కేంద్ర ఎన్నికల కమీషన్‌ను కోరనున్నారు.

సింగిల్ సింహమని తనని తాను పొగుడుకొనే ఏపీ సిఎం జగన్‌ సంక్షేమ పధకాల నిధుల విడుదల కోసమే తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి బయటకు వస్తుంటారు. ఆయన ఒత్తిడి భరిచలేకనే మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజల మద్యకు వెళుతున్నారు. కానీ 73 ఏళ్ళ వయసులో కూడా చంద్రబాబు నాయుడు ఇంత చురుకుగా తిరుగుతూ, కార్యక్రమాలలో పాల్గొంటుండటం విశేషమే కదా?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Mass H-1B Layoffs at Fortinet?

A Reddit post has gone viral for claiming that the cybersecurity firm Fortinet has laid…

2 hours ago

H-1B Applicant Arrested Over False Walmart Accusation

An Indian F-1 student finds herself in serious trouble. A misunderstanding at Walmart has left…

3 hours ago