
వైఎస్ రాజశేఖర్ రెడ్డి నన్ను లోపల వేసేందుకు నాపై అనేక కేసులు పెట్టారు కానీ ఏమీ చేయలేకపోయారు. ఎందుకంటే నేను ఎప్పుడూ నిప్పులాగే బ్రతికాను కనుక. నాపై ఎన్ని అవినీతి ఆరోపణలు చేసినా వాటిలో ఏ ఒక్కటీ నిరూపించలేకపోయారు. ఇక ఈ జగన్మోహన్ రెడ్డి నన్నేమి చేయగలడు?” అని అన్నారు.
ఆయన ఊహించిన్నట్లే ఈరోజు ఉదయం నంద్యాలలో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇది రాజకీయ కక్షపూరిత చర్య అని అర్దమవుతూనే ఉంది. అయితే ప్రజలకు అటువంటి భావన కలగకూడదనే సిఎం జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటనలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడుని అరెస్టు చేసిన్నట్లు భావించవచ్చు. అంటే ఈ అరెస్టుతో ఆయనకు ఏమీ సంబందం లేదని, స్కిల్ డెవలప్‌మెంట్ కేసు దర్యాప్తు జరుపుతున్న పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారని ప్రజలు అనుకోవాలన్న మాట!
అయితే చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయడానికి ‘శనివారం ముహూర్తం’ ఎందుకో అందరికీ తెలుసు. ఆదివారం కోర్టుకు సెలవు కనుక కనీసం రెండు రోజులైనా ఆయనను ఖైదీగా ఉంచాలనే దురాలోచనే కనబడుతోంది.
గత కొన్నిరోజులుగా మంత్రులందరూ పోటీలు పడుతూ మీడియా సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఐటి కేసులో చంద్రబాబు నాయుడు అరెస్ట్ తప్పదని చెప్పడం కూడా దీని కొరకే అని అర్దమవుతోంది. తద్వారా ప్రజలకు ముందస్తు సంకేతాలు ఇస్తూ చంద్రబాబు నాయుడు ఏదో ఓ రోజు అరెస్ట్ కావడం కావచ్చనే భావన కల్పించి, రాష్ట్రంలో అల్లర్లు, ఆందోళనలు చెలరేగకుండా ఉండేందుకే వారందరూ ఆ విదంగా మాట్లాడి ఉండవచ్చు.
Rajinikanth's highly anticipated sequel Jailer 2 directed by Nelson Dilipkumar is all set to hit…
Tamil actress Divya Bharathi, known for Bachelor and her special appearance in Maharaja, has sparked…