
జగన్ రాజకీయాలు ఎంత దారుణంగా ఉంటాయో 5 ఏళ్ళ పాలనలోనే స్పష్టమైంది. ఆ కారణంగానే ప్రజలు గద్దె దించినప్పటికీ ఆయన ధోరణిలో ఎటువంటి మార్పు రాలేదని తెనాలి పర్యటనతో స్పష్టమైంది.
దీనిపై సిఎం చంద్రబాబు నాయుడు చేసిన నిశిత వ్యాఖ్యలు ఆలోచింపజేస్తాయి. ఒకప్పుడు నేరస్థులతో ఫోటోలు దిగేందుకు రాజకీయ నాయకులు ఇష్టపడేవారు కారని, కానీ ఆర్ధిక నేరగాడైన జగన్ తెనాలి వెళ్ళి రౌడీ షీటర్స్‌ని కలిసి వచ్చారన్నారు.
ఆర్ధిక నేరాలు చేసిన విజయ్ మాల్యా దేశం విడిచి పారిపోయారు కానీ జగన్ మాత్రం రాష్ట్రంలోనే ఉంటూ నేరగాళ్ళందరినీ వైసీపీ కింద ఏకం చేసి నేరపూరితమైన రాజకీయాలు చేయాలని ప్రయత్నిస్తున్నారని సిఎం చంద్రబాబు నాయుడు అన్నారు.
కనుక ఇటువంటి రాజకీయ నాయకుడు, రాజకీయాలతో కూటమిలో అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
జగన్ పాలనలో అక్రమ కేసులు, వేధింపులకు ప్రతీకారంగా మనం కూడా ఆవిదంగా చేయాలనుకుంటే వైసీపీకి మనకీ తేడా ఉండదని అన్నారు.
కానీ జగన్‌తో సహా వైసీపీ నేతలు చేసిన ప్రతీ నేరాన్ని పక్కా సాక్ష్యాధారాలతో కేసు నమోదు చేసి అందరికీ శిక్షలు పడేలా చేద్దామని సిఎం చంద్రబాబు నాయుడు అన్నారు.
చంద్రబాబు నాయుడు అన్ని పార్టీలను కలుపుకొని, అభివృద్ధి హామీలతో ప్రజలను మెప్పించి అధికారంలోకి వచ్చారు. నేటికీ అదే విదానంతో ముందుకు సాగుతున్నారు.
కానీ జగన్మోహన్ రెడ్డి టీడీపీని నామరూపాలు లేకుండా చేసేందుకు ఆ పార్టీ నేతల ఆర్ధిక మూలాలని దెబ్బ తీశారు. ముఖ్య నేతలపై కేసులు నమోదు చేయించి వేధిస్తూ రాజకీయాల నుంచి తప్పుకోమని ఒత్తిడి చేసేవారు. ఇవేవీ ఫలించకపోవడంతో చివరికి చంద్రబాబు నాయుడుని జైల్లో పెట్టి మానసికంగా, శారీరికంగా క్రుంగిపోయేలా చేస్తే టీడీపీ తుడిచిపెట్టుకుపోతుందనుకున్నారు. కానీ ఏం జరిగిందో అందరికీ తెలుసు.
జగన్ రాజకీయాలు ఏవిదంగా ఉంటాయో తెలిసి ఉన్నప్పుడు, వచ్చే ఎన్నికలలో గెలిచి మళ్ళీ ముఖ్యమంత్రినవుతా, ఇంతకు ఇంత ప్రతీకారం తీర్చుకుంటానని శపధాలు చేస్తున్నపుడు, సిఎం చంద్రబాబు నాయుడు చెప్పినట్లు అందరూ అప్రమత్తంగా ఉండటం, మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ప్రజలతో మమేకం అవడం చాలా చాలా అవసరం.
పగబట్టిన పాములా జగన్ అదును కోసం ఎదురుచూస్తున్నారని తెలిసి ఉన్నప్పుడు, ఇలా ఆడుతూ పాడుతూ రాజకీయాలు చేసుకుంటామంటే చాలా ప్రమాదం.
టీడీపీ కోసమో లేదా కూటమి ప్రభుత్వం కోసమో కాదు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరోసారి జగన్‌ని భరించగలిగే స్థితిలో లేదు కనుక ఆయన బారి నుంచి రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు ముల్లుని ముల్లుతోనే తీయక తప్పదు.
Paid negativity has become an increasingly familiar phrase whenever a big film enters a crucial…
For decades, marriage was almost treated like a full stop in the careers of Indian…